మైండ్ బ్లాక్ చేస్తున్న “చెన్నకేశవ రెడ్డి” స్పెషల్ షోల రెస్పాన్స్.!

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన ఎన్నో భారీ హిట్స్ లో మాస్ చిత్రం “చెన్నకేశవ రెడ్డి” కూడా ఒకటి. కమర్షియల్ గా అప్పట్లో హిట్ కాకపోయినా ఈ సినిమా మాత్రం ఇప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్ లా నిలిచింది.

అందుకే నందమూరి అభిమానుల్లో కానీ తెలుగు ఆడియెన్స్ లో కానీ ఈ సినిమాకి బాలయ్య కెరీర్ లోనే ఓ స్పెషల్ ప్లేస్ ని అందించారు. అయితే ఈ సినిమాని లేటెస్ట్ గా తెలుగులో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ అవుతున్న ట్రెండ్ లో భాగంగా ఈ సినిమాని రీ రిలీజ్ కి ప్లాన్ చెయ్యగా.

మొదటగా మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లో ముందు బాలయ్య అభిమానులు ప్లాన్ చేసుకోగా ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ ఇప్పుడు నమోదు అవుతుందట. ఈ సినిమాకి ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా చేసిన అన్ని లొకేషన్స్ లో మాస్ రెస్పాన్స్ వస్తుందట ముఖ్యంగా యూఎస్ మరియు ఆస్ట్రేలియా లో బాలయ్య అభిమానులు దమ్ము చూపిస్తున్నారు.

దీనితో ఈ సినిమాకి రికార్డు వసూళ్లు ఓవర్సీస్ లో నమోదు కావడం గ్యారెంటీ అని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరిట “జల్సా” తో భారీ రికార్డు ఉండగా అసలు ప్లానింగ్ కూడా లేకుండా బాలయ్య సినిమా ప్లాన్ చేస్తే దీనికి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం  అని చెప్పాలి.