అఫీషియల్ : మెగా డైరెక్టర్ తో బాలయ్య భారీ ఏక్షన్ ప్రాజెక్ట్.!

ఈరోజు మన టాలీవుడ్ మాస్ గ్లోబల్ లయన్ నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు కాగా అభిమానులు అయితే ఈ వేడుకలు ఘనంగా చేస్తుండగా ఈరోజే తన అవైటెడ్ సినిమా “భగవంత్ కేసరి” నుంచి క్రేజీ అప్డేట్ అయితే టీజర్ తో వచ్చి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ని అందుకుంది.

మరి అఖండ నుంచి అయితే బాలయ్య అదిరే కం బ్యాక్ ని అందుకోవడమే కాకుండా అక్కడ నుంచి ఓ రేంజ్ లో లైనప్ ని సిద్ధం చేస్తుండగా ఈ లైనప్ లో అయితే లేటెస్ట్ గా కొన్నాళ్ల కితమే రూమర్ గా వచ్చిన మెగా డైరెక్టర్ బాబీ తో ప్రాజెక్ట్ ని అయితే ఇప్పుడు అఫీషయల్ గా మేకర్స్ అనౌన్స్ చేసేసారు.

మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ ఊహించని క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ ని అయితే రిలీస్ చేయగా అందులో చూసినట్టు అయితే పవర్ ఫుల్ కాప్షన్ కూడా ఉంది. “ఈ ప్రపంచానికి అతడెవరో తెలుసు కానీ అతడి ప్రపంచం ఏంటో ఎవరికీ తెలీదు” అంటూ పెట్టారు. అలాగే దీనితో పాటుగా వైలెన్స్ కి విజిటింగ్ కార్డు అతడే అంటూ పవర్ ఫుల్ లైన్స్ ని అయితే తెలిపారు.

ఇక పోస్టర్ లో ఒక బాక్స్ చూసినట్టు అయితే అందులో పలు మారణాయుధాలు బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యాప్ కూడా కనిపిస్తున్నాయి. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏ లెవెల్ మాస్ లో ఉంటుందో అసలు “వాల్తేరు వీరయ్య” తర్వాత బాబీ నుంచి ఊహించని మాసివ్ ప్రాజెక్ట్ ఉంటుంది అని ఊహించకపోవచ్చు. కాగా ఈ చిత్రాన్ని అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వీరితో పాటుగా త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ కూడా కలిసి నిర్మాణం వహిస్తున్నారు.