విడుదల ఐన 2 గంటలలో యూట్యూబ్ రికార్డ్ లు బద్దలుకొట్టిన చిరంజీవి ‘ఆచార్య’ వీడియో..!

megastar chiranjeevi acharya motion poster creates records in youtube

ఇవాళ వినాయక చవితి.. అది దేవుడి పండుగ. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఇది ఆయన అభిమానుల పండుగ. అవును.. మెగాస్టార్ చిరంజీవి అంటే మామూలు వ్యక్తి కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసిన స్టార్ ఆయన. ఇప్పుడున్న చాలామంది హీరోలు ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్లే. అందరూ ఆయన్ను అనుకరించేవాళ్లే.

megastar chiranjeevi acharya motion poster creates records in youtube
megastar chiranjeevi acharya motion poster creates records in youtube

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్తదనాన్ని, సరికొత్త డ్యాన్స్ ను, ఫైట్ ను చిరంజీవి పరిచయం చేశారు. ఆయన ఇప్పటి వరకు 151 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం 152 వ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.

ఆయన బర్త్ డే సందర్భంగా 152 వ సినిమా ఆచార్య ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదలయింది. పోస్టర్ విడుదలయిన 2 గంటల్లోనే ఆచార్య మోషన్ పోస్టర్ రికార్డులను తిరగరాస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో.. ఇప్పటి వరకు ఏ మోషన్ పోస్టర్ కు లేనంతగా అద్భుతమైన రెస్పాన్స్ దీనికి వస్తోంది.

ట్విట్టర్ లో అయితే ఆచార్య పేరుతో ఉన్న హ్యాష్ టాగ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. యూట్యూబ్ లో విడుదలైన మోషన్ పోస్టర్ కూడా అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది.

మరోవైపు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలంతా ఆచార్య మోషన్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ ను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆచార్య గురించే చర్చ.

ఇక ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… ఈ సినిమాలో ముఖ్యమైన రోల్ లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఆయన సరసన రష్మిక మందన్న నటించనుంది.

ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఓ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. డ్యుయల్ రోల్ లో చిరంజీవి నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరో పాత్రలో నక్సలైట్ గా చిరంజీవి కనిపిస్తారట. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా… వచ్చే సమ్మర్ సీజన్ లో సినిమాను రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది.