“లైగర్” సినిమాకి మెగా బ్లెస్సింగ్స్ వచ్చేశాయ్..ఇక ఆపేది ఎవరు??

ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ చాలా అంచనాలు నెలకొల్పుకునే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా “లైగర్”. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే పలువురు స్టార్ హీరోల ఫస్ట్ డే వసూళ్ల రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నారు.

అంటే ఈ సినిమాపై ఏ లెవెల్లో అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే రికార్డు మొత్తంలో బుకింగ్స్ నమోదు కాగా ఈ సినిమా రిలీజ్ కి ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది.

మరి ఇదే విధంగా ఈ సినిమాకి తెలుగు దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా తన బ్లెస్సింగ్స్ ని అందించడం ఆసక్తిగా మారింది. లైగర్ యూనిట్ అందరికీ దర్శకుడు జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే అలాగే నిర్మాతలు ఛార్మి మరియు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లకు బెస్టాఫ్ లక్ తెలిపి ఈ సినిమా సూపర్ పంచింగ్ విజయాన్ని అందుకోవాలని బ్లెస్ చేశారు.

దీనితో ఈ చిత్ర యూనిట్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ కి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక మెగా బ్లెస్సింగ్స్ కూడా వచ్చేసాయి అంటే సినిమాకి డెఫినెట్ గా మరింత పాజిటివ్ వాతావరణం వచ్చినట్టే.. 
https://twitter.com/karanjohar/status/1562314287108194306