రిలీజ్ టైం లో “గాడ్ ఫాదర్” విషయంలో ఫ్యాన్స్ అసహనం.. కారణం ఇదేనట.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఈ దసరా కానుకగా రిలీజ్ కి రాబోతున్న చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార మరియు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లు కీలక పాత్రల్లో నటించిన చిత్రం గాడ్ ఫాదర్ కూడా ఒకటి. అయితే స్టార్టింగ్ లో సినిమాపై ఉన్న హైప్ కి ఇప్పుడు హైప్ కి చాలా తేడా ఉందని చెప్పొచ్చు.

మరి ఈ సినిమా రిలీజ్ కి గాను ఎన్నో రోజులు కూడా సమయం లేదు కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో అయితే మెగా ఫ్యాన్స్ కాస్త వ్యక్తం చేస్తున్నారు. ఇది అసలు మెగాస్టార్ రిలీజ్ లానే లేదని ముఖ్యంగా కొణిదెల ప్రొడక్షన్స్ ప్రమోషన్స్ దరిద్రంగా ఉన్నాయని అంటున్నారు.

రిలీజ్ మూడు రోజులే ఉన్న సినిమా అసలు ఈ ప్రమోషన్స్ ఏంటి అని అంటున్నారు. దీనితో డోస్ అయితే అసలు సరిపోలేదని డెఫినెట్ గా మరిన్ని మంచి ప్రమోషన్స్ చెయ్యాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీనితో అయితే గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం ఇప్పుడు ఫ్యాన్స్ చాలా డిజప్పాయింటింగ్ గా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమా కి థమన్ సంగీతం అందించగా మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. అలాగే ఈ అక్టోబర్ 5నే ఈ చిత్రం తెలుగు, హిందీ మలయాళం లో రిలీజ్ కాబోతుంది.