పెళ్లి తర్వాత నీహారిక మాస్టర్ ప్లాన్ ఇదే
మెగా ప్రిన్సెస్ నీహారిక పెళ్లి ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్. పోలీస్ అత్యున్నత అధికారి కుమారుడైన జొన్నలగడ్డ చైతన్యను నీహారిక పెళ్లాడేస్తోంది. ఇప్పటికే వరుడి ఫోటోల్ని నీహారిక స్వయంగా రివీల్ చేయడం అవి వైరల్ గా మారడం తెలిసిందే. 2021 ప్రథమార్థంలో ఈ వివాహం జరగనుంది. అయితే పెళ్లి తర్వాత నీహారిక ప్లాన్స్ ఏమిటి? తిరిగి నటనలో కెరీర్ సాగిస్తుందా? కథానాయికగా కంటిన్యూ అవుతుందా? అంటే.. తాజాగా అందుకు సంబంధించిన ఆసక్తికర సమాచారం తెలిసింది.
పెళ్లి తర్వాతా నీహారిక మాస్టర్ ప్లాన్ తాజాగా రివీలైంది. ఇప్పటికే నీహారిక ఓ ప్రాజెక్టుకు కమిటైంది. సూర్యకాంతం ఫేం ప్రణీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా హరీష్ శంకర్ వేరొక భాగస్వామితో కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రణీత్ అడ్వాన్సులు అందుకున్నారని తెలుస్తోంది.
అయితే దీనిని ఇప్పట్లో పూర్తి చేయడం కష్టమే. కరోనా క్రైసిస్ కారణంగా ఇది 2021లోనే పాజిబుల్ అని అంచనా వేస్తున్నారు. 2021 ఆరంభంలో లేదా సమ్మర్ లో నీహారిక పెళ్లి ఉంటుంది. అటుపై మూవీ సెట్స్ కెళ్లే వీలుంటుందని భావిస్తున్నారు. అంటే పెళ్లి తర్వాతా నీహారిక కథానాయికగా కొనసాగుతుందని అర్థమవుతోంది. ఇక నాయికా ప్రాధాన్య స్క్రిప్టులు ఎంచుకుని నటించేందుకు లేదా వెబ్ సిరీస్ నాయికగా కొనసాగేందుకు ఆస్కారం లేకపోలేదు. ఇక నిర్మాతగానూ నీహారిక అడుగులు వేసే వీలుందని భావిస్తున్నారు.