ఇస్మార్ట్ ఆర్జీవీ మందు చిందు చూశారా?

మైకం క‌మ్మిన ఆర్జీవీ ఏం చేశాడో!

ఆర్జీవీకి దుఃఖం వ‌చ్చినా.. సంతోషం క‌లిగినా ఉప్పెన ముంచుకొచ్చిన‌ట్టే. అందుకు ఇదిగో ఇదే ప్రూఫ్‌. శిష్యుడు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఇస్మార్ట్ శంక‌ర్` ఘ‌న‌మైన‌ ఓపెనింగులు సాధించి ఇప్ప‌టికే 12కోట్లు వ‌సూలు చేయ‌డంతో ఆ ఆనందం త‌ట్టుకోలేక‌పోతోంది టీమ్. తొలి వీకెండ్ నాటికే ఇస్మార్ట్ శంక‌ర్ పెట్టిన పెట్టుబ‌డుల్ని తిరిగి రాబ‌ట్టేస్తోంది కాబ‌ట్టి ఇక ఈ సెల‌బ్రేష‌న్ ని ఓ రేంజులో ప్లాన్ చేసింది ఇస్మార్ట్ బ్యాచ్‌.

అస‌లే లేక లేక ద‌క్కిన విజ‌య‌మిది. అటు ఆర్జీవీకి.. ఇటు పూరికి అన్నీ ఫ్లాపులే కావ‌డంతో ఎంతో నీర‌సించిపోయి ఉన్నారు. అందుకే గురువు ఆర్జీవీ త‌ట్టుకోలేక‌పోయారు. స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. పార్టీలో బీర్ పొంగించి ఓ రేంజులో రెచ్చిపోయారు. ఆయ‌న చెల‌రేగిన తీరు చూస్తే మైకం క‌మ్మిన ఆర్జీవీ ఏమిటీ పిచ్చి వేషాలు? మ‌రీ అంత ఓవ‌ర్ ఎగ్జ‌యిట్‌మెంట్ అవ‌స‌ర‌మా? అంటూ సామాజిక మాధ్య‌మాల్లో అప్పుడే పంచ్ లు ప‌డిపోతున్నాయ్. ఈ వీడియోని ఆర్జీవీ స్వ‌యంగా ఇన్ స్టాలో పోస్ట్ చేయ‌డంతో అది జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయిపోతోంది. పార్టీలో బీర్ పొంగించి ఇస్మార్ట్ టీమ్ పై వెద‌జ‌ల్లుతూ ఆర్జీవీ చేసిన విన్యాసాలు పిచ్చెక్కించాయి. ఛార్మి- నిధి అగ‌ర్వాల్- న‌భా న‌టేష్ .. ఎవ్వ‌రినీ విడిచిపెట్ట‌లేదు గురూజీ. అంద‌రినీ బీర్ లో ముంచేశారు. అంద‌రిపైనా బీర్ ని విచ్చ‌ల‌విడిగా చిందించారు. అక్క‌డితో ఆగ‌కుండా త‌న నెత్తి మీద‌నా ఆర్జీవీ బీర్ ఒల‌క‌బోసుకున్నారు. పూరి ఓ వైపు ఈ ఆనందాన్ని గురువుగారితో క‌లిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూడండి. ఓవైపు అరుపులు కేక‌ల‌తో పార్టీలో గ‌గ్గోలు పెట్టించారంటే న‌మ్మండి. ఇదిగో ఈ వీడియో చూస్తే ఆ సంగ‌తి మీకే అర్థ‌మ‌వుతుంది. పాపం .. విదేశాల‌కు వెళ్ల‌డంతో ఈ చిలౌట్ ని హీరో రామ్ మిస్స‌య్యాడులెండి!!

https://www.instagram.com/p/B0IgOymFxOm/?utm_source=ig_web_copy_link