మాసివ్ అప్డేట్ : ప్రభాస్ “సలార్” నుంచి భారీ అప్డేట్ వదిలిన మేకర్స్..డీటైల్స్ ఇవే!

గత కొన్ని రోజులు నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఏదన్నా ఉంది అంటే అది “సలార్” నుంచే అని చెప్పాలి. ప్రభాస్ ఇప్పుడు పలు సినిమాలు చేసి ఆల్రెడి “ఆదిపురుష్” అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా కూడా ప్రభాస్ అభిమానులు మాత్రం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ ఏక్షన్ డ్రామా “సలార్” కోసమే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ నుంచి చాలా కాలం తర్వాత వారి ఆకలి తీరే విధంగా ప్లాన్ చేసిన సినిమా ఇదే కావడంతో తారా స్థాయి అంచనాలు మాత్రం ఈ సినిమాపై ఉన్నాయి. ఇక నిన్ననే ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అని ఓ టాక్ పెద్ద ఎత్తున వైరల్ కాగా ఇప్పుడు దీనిపై మేకర్స్ కూడా ఒక భారీ అప్డేట్ ని అందించారు. ఈ సినిమా నుంచి ఈ ఆగష్టు 15 న మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

దీనితో ఈ పోస్ట్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మరింత కేజ్రీగా ఫీలవుతున్నారు. మొత్తానికి అయితే ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఏంటో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేజీఎఫ్ బృందం వర్క్ చేస్తున్నారు. అలాగే హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.