Manshi Joshi: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తో ఏడడుగులు తెలుగు బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్!

Manshi Joshi: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. అటు వెండితెర సెలబ్రిటీలు ఇటు బుల్లితెర సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. అలా తాజాగా కూడా తెలుగు బుల్లితెర నటి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆమె తాజాగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆ బుల్లితెర నటి మరెవరో కాదు నటి మాన్షి జోషి. అయితే మాన్షి జోషి అంటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ పలుకే బంగారమాయేనా సీరియల్ స్వర అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది. అయితే ఈ సీరియల్ కంటే ముందు ఆమె దేవత వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ గత ఏడాది అక్టోబర్ లో రాఘవ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ఎంగేజ్మెంట్ ను చేసింది. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా బెంగళూరు లోని ఒక ఫంక్షన్‌ హాల్‌ లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌ గా జరిగింది.

ఈ పెళ్లి వేడుకలో సినీ తారలు, సన్ని హితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మాన్షి జోషి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మొదట.కన్నడలో పలు సీరియల్స్‌ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాన్షి జోషి తెలుగులో దేవత అనే సీరియల్‌ లో కనిపించింది. ఈ సీరియల్‌ లో అర్జున్ అంబటి, చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కన్నడలో పారు సీరియల్‌ తో ఫేమ్ తెచ్చుకుంది.