కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్

బిగ్ బాస్ సీజన్ 2 చివరి అంకంలోకి అడుగు పెట్టింది. ఫైనల్స్ కు కౌశల్, తనీష్, సామ్రాట్, గీత మాధురి, దీప్తి చేరుకున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ప్రాముఖ్యత సంతరించుకుంది. గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న కౌశల్ కోసం బయట కౌశల్ ఆర్మీ పేరుతో రక్షణ కవచంలా అభిమానులు తయారయ్యారు.

కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అవడానికి రకరకాలుగా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా పలుచోట్ల 2కె రన్ నిర్వహిస్తున్నారు కౌశల్ ఆర్మీ. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. శనివారం నాని కౌశల్ కి ఒక ప్రశ్న సంధించారు. కౌశల్ ఆ ప్రశ్నకు వివరణ ఇచ్చాడు. దీనిపై కత్తి మహేష్ ఇలా పోస్టు పెట్టాడు. పేలవమైన, విసుగు పుట్టించే సవివరణ ఇచ్చాడు కౌశల్…తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే చిరాకు తెప్పించే వ్యక్తి అంటూ ట్వీట్ చేసాడు.

https://twitter.com/MaheshhKathi/status/1043556322522759169

అంతేకాదు బిగ్ బాస్ 2 లోనే అసంబద్ధమైన, అహేతుకమైన వ్యక్తి కౌశల్. అతడు బిగ్ బాస్ గెలిస్తే మన అంత ఇడియట్స్ ఉండరు అని కౌశల్ ఆర్మీకి కోపం తెప్పించేలా ట్వీట్ పెట్టాడు. కత్తి మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై కౌశల్ ఫ్యాన్స్ మంది పడుతున్నారు. వరుస కామెంట్లతో దుయ్యబడుతున్నారు. 

https://twitter.com/MaheshhKathi/status/1044093036634923008

కౌశల్ అభిమానుల ట్వీట్లు కింద చూడవచ్చు.

https://twitter.com/vjagadish1983/status/1044101077849853952

మరొక విషయం ఏమిటంటే తాను దీప్తి తరపున క్యాంపెయినింగ్ చేస్తానని ఫేస్బుక్ ద్వారా తెలిపాడు కత్తి మహేష్.