షాకింగ్ : “థాంక్ యూ” డిజాస్టర్ లో మహేష్ బాబుకి కూడా భాగం ఉందా?

మన తెలుగు సినిమాలో భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మరి మహేష్ తో పాటుగా ఇంకా అనేకమంది స్టార్స్ కూడా ఉండగా ఎప్పుడు నుంచో వారి రిఫరెన్స్ లు అనేక సినిమాల్లో మనం కూడా చూస్తూ వచ్చాం.

మరి అలా లేటెస్ట్ గా అయితే ఓ యంగ్ స్టార్ హీరో ఏకంగా మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్ లా సినిమా కూడా చేసాడు. ఆ సినిమానే “థాంక్ యూ”. అక్కినేని వారి యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంని విక్రమ్ కే కుమార్ తెరకెక్కించగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యినప్పుడే నాగ చైతన్య మహేష్ బాబుకి సూపర్ ఫ్యాన్ లా కనిపిస్తాడని తెలిసింది.

దీనితో వారిలో కూడా మంచి హైప్ నెలకొంది. పైగా సినిమా రిలీజ్ సమయంలో కూడా మేకర్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని అలెర్ట్ చేస్తూ పోస్టులు కూడా చెయ్యగా సోషల్ మీడియాలో అయితే మహేష్ ఫ్యాన్స్ బాగానే హడావుడి చేశారు. కానీ సీన్ కట్ చేస్తే అసలు ఈ సినిమాకి మహేష్ ఫ్యాన్స్ ఎవరూ వెళ్ళలేదని చెప్పాలి.

డెఫినెట్ గా అక్కినేని ఫ్యాన్స్ తో పాటు మహేష్ అభిమానులు కూడా ఫస్ట్ డే సినిమా చూసినా మంచి వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమాకి నాగ చైతన్య కెరీర్ లోనే అతి తక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి.

దీనితో ఈ సినిమా విఫలంలో మహేష్ కి కూడా భాగం ఉందని ఒక టాక్ మొదలయ్యింది. మరి మొత్తానికి అయితే ప్రస్తుతం ఎందుకో ఆడియెన్స్ సరైన మూడ్ లో లేరు అందుకే థియేటర్స్ లో సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. మరి వీటికి హీరోలను బ్లేమ్ చెయ్యడం కూడా సరైనది కాదు. కానీ ఓ పెద్ద హీరో సినిమా పడితే అంతా సెట్టయ్యే అవకాశం ఉంది.