మ‌హేష్ 27లో ఊహించ‌ని ట్విస్ట్ అదే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కెరీర్ 27వ సినిమా లాంచ్ ఎప్పుడు? ఇందులో మ‌హేష్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండ‌బోతున్నాయి? అన్న‌దానికి తాజాగా ఓ లీక్ అందింది. రిలీజ్ తేదీపైనా తాజా పోస్ట‌ర్ ఒక‌టి లీకులిచ్చింది.

ఈ ఆదివారం ఉద‌యం కృష్ణ పుట్టినరోజు(మే31) సందర్భంగా మహేష్ కొత్త సినిమాని లాంచ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ టైటిల్ సర్కార్ వారి పాట అన్న ప్ర‌చారం ఉంది. అయితే దానిని కూడా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

తాజా లీక్స్ ప్ర‌కారం.. మ‌హేష్ ఈ చిత్రంలో త్రిపాత్రాభిన‌యం చేస్తున్నార‌ని తెలుస్తోంది. మూడు డిఫ‌రెంట్ ఏజ్ లు .. గెట‌ప్పుల‌తో అత‌డు స‌ర్ ప్రైజ్ చేస్తాడ‌ట‌. ప‌ర‌శురామ్ ఆ పాత్ర‌ల్ని అద్భుతంగా తీర్చిదిద్దాడ‌ట‌. మ‌హ‌ష్ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నీసం ద్విపాత్రాభిన‌యం అన్న‌దే చేయ‌లేదు. బాల‌న‌టుడిగా ఉన్న‌ప్పుడు డ్యూయ‌ల్ రోల్ చేశాడు కానీ హీరో అయ్యాక సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్ప‌టికి త్రిపాత్రాభిన‌యం అంటే ఆస‌క్తిక‌ర‌మే. బ‌హుశా ఇందులో టీనేజ‌ర్ లుక్ కోస‌మే ఇటీవ‌ల మహేష్ జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేసి బాగా బ‌రువు త‌గ్గాడు. లుక్ అమాంతం మార్చేశాడు. రేప‌టి లాంచింగ్ గురించి ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంటుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నార‌ని స‌మాచారం. ఉగాది 2021 కానుక‌గా రిలీజ్ చేసే ప్లాన్ ఉంద‌న్న స‌మాచారం ఉంది.