‘గీతగోవిందం’లా బ్లాక్‌బ్లస్టర్‌ కావాలి ఫ్యామిలీ స్తార్‌ మూవీ ప్రీరిలీజ్‌ వేడుకల్లో దిల్‌ రాజు

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ ను హైదరాబాద్‌ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్‌ దేవరకొండ , నిర్మాత దిల్‌ రాజు, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా హైలైట్స్‌ ఈ కార్యక్రమంలో వివరించారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమా విషయంలో ప్రతి అంశం పాజిటివ్‌ గా కనిపిస్తోంది. పాటలు, ట్రైలర్‌ విూరు చూశారు విూ అందరికీ నచ్చింది. అందుకే విూలోనూ ఆ హ్యాపీనెస్‌ కనిపిస్తోంది. పరశురామ్‌ ఈ కథ చెప్పగానే అందులోని పాయింట్‌ నన్ను ఎగ్జైట్‌ చేసింది. స్టోరీని డెవలప్‌ చేశాక మేమంతా ఇంప్రెస్‌ అయ్యాం. విజయ్‌, పరశురామ్‌ కలిసి ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ చేశారు. ఈ సినిమా కూడా వాళ్ల కాంబినేషన్‌ లో సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ‘ఫ్యామిలీ స్టార్‌’ కు విజయ్‌ క్యారెక్టరైజేషన్‌ వెన్నెముక లాంటిది. విజయ్‌ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెను ద్వేషిస్తాడు, రొమాన్స్‌ చేస్తాడు..ఇలా అన్ని షేడ్స్‌ హీరో క్యారెక్టర్‌ లో ఉన్నాయి. విజయ్‌ ఈ సినిమాలో 360 డిగ్రీస్‌ క్యారెక్టర్‌ చేశాడని చెప్పవచ్చు. ఇది కేవలం ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు లవ్‌ స్టోరీ కూడా ఉంటుంది. 30 పర్సెంట్‌ ఫ్యామిలీ స్టోరీ, 70 పర్సెంట్‌ లవ్‌ స్టోరీ ఉంటుంది. మృణాల్‌ లక్కీ హీరోయిన్‌. సీతారామం, ‘హాయ్‌ నాన్న’ సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీ స్టార్‌ తో ఆమె హ్యాట్రిక్‌ అందుకోబోతోంది. దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు.

ఇప్పుడు కూడా డబ్బింగ్‌, మిక్సింగ్‌ వర్క్స్‌ చేయిస్తున్నాడు. మా సంస్థలో విజయ్‌ తో తను చేస్తున్న సినిమాను సక్సెస్‌ చేయాలనే తపన పరశురామ్‌ లో ఉంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌ కూడా ఎంతో ఇన్వాల్వ్‌ అయ్యింది. సినిమాటోగ్రాఫర్‌ కేయూ మోహనన్‌, ఎడిటర్‌ మార్తాండ్‌ వెంకటేష్‌, ఆర్ట్‌ ఏఎస్‌ ప్రకాష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌..ఇలా వీళ్లంతా తమ బెస్ట్‌ ఇచ్చారు. మా సంస్థలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్స్‌ వచ్చాయి. ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్స్‌ విషయంలో నా గురి తప్పలేదు. ఒక్క ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా మాత్రమే అనుకున్నంత ఫలితం రాలేదు. మన ఇండియన్‌ కల్చర్‌ లోనే ఫ్యామిలీ అంటే మనకొక విడదీయని అనుబంధం ఉంటుంది. అలాంటి కుటుంబానికి తను అండగా నిలబడి అభివృద్ధిలోకి తీసుకొచ్చేవారు ఎందరో ఉంటారు. అలాంటి వారంతా ఫ్యామిలీస్టార్స్‌ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. అమెరికా లాగ మనం పదహారేళ్లకు పిల్లల్ని వారి దారిన వారిని వదిలేయం. రెండు మూడు తరాలు కలిసి ఉంటాయి. ఆ ఫ్యామిలీ వ్యాల్యూస్‌ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఏప్రిల్‌ 5 నాకు ఎంతో స్పెషల్‌. ఆ రోజుతో ‘దిల్‌’ సినిమా రిలీజ్‌ తో నేను రాజు నుంచి దిల్‌ రాజు అయ్యాను. అప్పటి నుంచి మొన్నటి ‘బలగం’ సినిమా వరకు విూరూ, ప్రేక్షకులూ ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆ సపోర్ట్‌ ఇకపైనా కొనసాగాలి. విూడియా మిత్రులు వారి కుటుంబ సభ్యులతో ఒక గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే విూడియా మిత్రుల ఫ్యామిలీస్‌ కోసం ఫ్యామిలీ స్టార్‌ స్పెషల్‌ షో అరేంజ్‌ చేస్తున్నాం. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఎనర్జిటిక్‌ గా పాటలు పాడుతున్నా, డ్యాన్సులు చేస్తున్నా. అంతేగానీ స్క్రీన్‌ విూద నటించే ఆలోచన లేదు. విజయ్‌ హీరోగా మా సంస్థలో ఓ భారీ పాన్‌ ఇండియా మూవీ ఉంటుంది. దానికి స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కు టైమ్‌ పట్టేలా ఉంది. అదంతా పూర్తయ్యాక ఆ మూవీ తప్పకుండా సెట్స్‌ విూదకు తీసుకెళ్తాం. విజయ్‌ ప్రొడ్సూసర్స్‌ గురించి ఆలోచించే హీరో. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా అన్నారు.

హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ: ` సీతారామం సినిమాకు వర్క్‌ చేస్తున్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు ఇంత గొప్ప కెరీర్‌ ఉంటుందని అనుకోలేదు. ‘సీతారామం’ తర్వాత ‘హాయ్‌ నాన్న’ వంటి మంచి స్క్రిప్ట్‌ దొరికింది. ఈ రెండు సినిమాల తర్వాత నేను చేసే సినిమాల స్పెషల్‌ గా ఉండాలని అనుకున్నా. అలాంటి స్పెషల్‌ స్కిప్ట్‌ ను పరశురామ్‌ గారు నెరేట్‌ చేశారు. గోవర్థన్‌, ఇందూ, బామ్మ ఇతర క్యారెక్టర్స్‌ మధ్య బ్యూటిఫుల్‌ గా స్టోరీ ఉంటుంది.

హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ….. మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే పర్సన్‌ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్‌. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్‌. డైరెక్టర్‌ పరశురామ్‌ ఈ కథ చెప్పినప్పుడు ఆయన లైఫ్‌ లోని అనుభవాలను ఊహించుకుంటూ చెప్పాడు. కథ వింటున్నప్పుడు మాత్రం నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకువచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ కు గోవర్థన్‌ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎమోషన్స్‌ పలికించడం సులువు అవుతుంది. ఆయన ఎలా ఫ్యామిలీ కోసం పనిచేసేవారో గుర్తుకువస్తుంటుంది. ఏప్రిల్‌ 5న ‘ఫ్యామిలీ స్టార్‌’ రిలీజ్‌ అవుతోంది. ఏప్రిల్‌ 8న నాన్న బర్త్‌ డే. ఈ సినిమా విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నానని అన్నారు.