రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ సినిమా చేస్తానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా… రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే.. అని అన్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ . ఆయన హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో త్వరలో భారీ పాన్ ఇండియా మూవీ.. దిల్ రాజు ప్లాన్ మాములుగా లేదుగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ. ‘ఆరేళ్ల కిందట నా కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ ఇదే డైరెక్టర్‌తో చేశాను. ఆ రోజులు వేరు. కొత్తగా ఇండస్టీక్రి వచ్చి వరుసగా సూపర్ హిట్స్ ఇస్తున్నాడని నా గురించి మాట్లాడుకున్నారు.
నా మొదటి సినిమా ’పెళ్లి చూపులు’ టైమ్‌లో విూ గురించి విూరు వినాలని అనుకుంటున్న పెద్ద గాసిప్ ఏంటని అడిగితే.. నా సినిమా వంద కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్లు న్యూస్ చూడాలి అన్నాను. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అప్పటికీ. ఆ డ్రీమ్ నా నాలుగో సినిమాకే నిజమైంది. ‘గీత గోవిందం’ వంద కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. వంద కోట్ల రూపాయల వసూళ్ల సినిమా అందుకోవాలి అని చెప్పిన కుర్రాడు.. తన మరో సినిమా రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తుందని చెప్పాడు.
కానీ అందుకోలేకపోయాడు. అలా ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావు అని నాతో చాలా మంది అన్నారు. నీ వయసు హీరో అలా మాట్లాడితే అహంకారం అనుకుంటారు అని ప్రేమతో నాకు చెప్పిన పెద్దవాళ్లున్నారు. రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ సినిమా చేస్తానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా… రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే. కానీ ఇది నా విూద నాకున్న నమ్మకం, విశ్వాసం అని ప్రకటించాడు. ’పెళ్లి చూపులు’ నుంచి ’ఫ్యామిలీ స్టార్’ వరకు నేను చేసిన ప్రతి సినిమా ఏదో కొత్త విషయాన్ని నేర్పించింది. ఇదొక జర్నీ.
ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు ఎదురవుతుంటాయి. అవన్నీ దాటుకుని మనం అనుకున్నది సాధించాలి. మనకు మన గోల్ మాత్రమే కనిపించాలి. నేను అలాగే అనుకుంటా. అదే నమ్మకంతో పనిచేస్తుంటా. విూలో చాలా మంది యాక్టర్స్, బిజినెస్ మెన్, డైరెక్టర్స్, కంటెంట్ క్రియేటర్స్.. ఇలా ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. ఆ కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి. నేను నా మొదటి సినిమా ప్రీ రిలీజ్‌లోనే చెప్పాను. తలెత్తుకోండి, హ్యాపీగా ఉండండి.