‘మహర్షి’:ఓ స్ట్రాటజీ ప్రకారమే సెట్ గురించి పబ్లిసిటీ? !

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మహర్షి’.మహేష్ బాబు‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైన షెడ్యూల్‌ నెలరోజుల పాటు సాగుతుంది. అక్కడ మహేశ్‌, అల్లరి నరేశ్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి దిల్‌ రాజు, అశ్వినీదత్‌, పీవీపీ నిర్మాతలు. ఈ ముగ్గురు నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో మూడు ఆకులు ఎక్కువ చదివినవాళ్లే. గత రెండు రోజులుగా మీడియాలో ఎనిమిది కోట్లు పెట్టి ఈ చిత్రానికి ఓ విలేజ్ సెట్ వేసామని వార్తలు ఎక్కడ చూసినా కనపడుతున్నాయి.

ఆ న్యూస్ లు కేవలం ఎనిమిది కోట్లు అనే ఫిగర్ నే హైలెట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. నిజంగా అంత ఖర్చు పెట్టి సెట్ వేసారా అనేది ప్రక్కన పెడితే.. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఈ సెట్ గురించి ఎందుకింత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం కేవలం బిజినెస్ ఏంగిల్ లో జరుగుతున్న ప్రమోషన్ అని తెలుస్తోంది. సినిమాకు ఎంత ఖర్చుపెడుతున్నాం అనేది ఇండైరక్ట్ గా మీడియా ద్వారా సినిమాని కొనే బయ్యర్లు,డిస్ట్రిబ్యూటర్స్ ,ఎగ్జిబిటర్స్ కు చేరితే..బిజినెస్ చేసేటప్పుడు ఈజిగా అవుతుందనే ఈ స్ట్రాటజీ అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ స్ట్రాటజీలు ప్రతీ పెద్ద సినిమాకు జరుగుతూంటుంది. అందులో అయితే వింతేమీ లేదు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.