హైదరాబాదులోని గవర్నమెంట్ హాస్పటిల్స్ పని తీరుపై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పటిల్ ల తీరుతో తన స్నేహితుడిని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ జరిగిన దారుణాన్ని అశ్విన్ వివరించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెమెరామెన్ గా పని చేస్తున్నా అశ్విన్ స్నేహితుడు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను గాంధీ ఆసుప్రతికి తరలించారు. అయితే, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆయన మరణించారు. దాంతో ఆవేదన చెందిన నాగ అశ్విన్ ట్వీట్ చేసారు.
‘ప్రమాదం జరిగిన వెంటనే నా స్నేహితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే అతన్ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి… అటు, ఇటు మోసుకుంటూ తిరిగారు. గాంధీ ఆసుపత్రికి కాకుండా మరే ఆసుపత్రికి తీసుకెళ్లినా అతను బతికేవాడు. రాజధాని నగరమైన హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మనుషులు ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం?
కేటీఆర్ సార్.. ప్రభుత్వాసుపత్రి చావులకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదని చెప్పడానికి ఏం చేయమంటారు? వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీనిపై ఎవరిని ప్రశ్నించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వైద్యం అందక ఎవరూ చనిపోరాదు’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.