ఇంజనీరింగ్ కాలేజీల్లో జూనియర్ల పట్ల సీనియర్ విద్యార్ధులు ఎలా ర్యాగింగ్ చేస్తారో చూస్తూనే ఉంటాం. అన్ని రకాల కాలేజీల్లోనూ ర్యాగింగ్ లుంటాయి. కానీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ లు మాత్రం ప్రత్యేకమనే అనాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీ ర్యాగింగ్ లు ఆరోగ్య కరమైన వాతావరణంలో ఉండవు. వేడిని..వివాదాలు పుట్టించేలా ఉంటాయి. అలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ర్యాగింగ్ లను తాళ్లలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్ధి, విద్యార్ధినులు ఎంతో మంది ఉన్నారు. మరి ఇలాంటి ర్యాగింగ్ లు కేవలం కాలేజీలకే పరిమితమా? టాలీవుడ్ ఇండస్ర్టీలో కూడా పతాక స్థాయిలో ఉంటాయా? జూనియర్ కమెడియన్లను సీనియర్ కమెడియన్లు సీ గ్రేడ్ ఆర్టిస్టులుగా చూస్తారా? అంటే అవుననే అంటున్నారు కొంత మంది సీనియర్ పాత్రికేయులు.
పరిశ్రమకు కొత్తగా వచ్చే ఆర్టిస్టులను, కమెడియన్లను సీనియర్లు చాలా చిన్న చూపు చూస్తుంటారుట. ఆన్ సెట్స్ లో ర్యాగింగ్ లకు పాల్పడుతుంటారుట. ముఖ్యంగా కాంబినేషన్ సన్నివేశాలున్నప్పుడు సీన్ పూర్తిచేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటారుట. డైలాగులు చెప్పేటప్పుడు…ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు తికమక పెట్టే ప్రయత్నాలు విపరీతంగా చేస్తుంటారుట. అరే వచ్చాడురా! ఇండస్ర్టీకి ఉద్దరిద్దామని హేళన చేసే మాటలతో మానసిక క్షోభకు గురిచేస్తారుట. ఈ విధానం టాలీవుడ్ ఇండస్ర్టీలో కొన్ని దశాబ్ధాలుగా ఉందని అంటున్నారు. అదీ చెన్నైలో పరిశ్రమ ఉన్నప్పుడు ఈ రకమైన ఒరవడి ఎక్కువగా ఉండదేన్నారు.
ఈ నేపథ్యంలో దివంగత నటుడు ఏవీఎస్ కమెడియన్ గా బిజీ అవుతోన్న సమయంలో ఆయన్ని కొంత మంది సీనియర్స్ ఎన్నో ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ హవా నడుస్తోన్న సమయంలో ఏవీఎస్ వాళ్లతో బాగా ఇబ్బంది పడే వారని అన్నారు. తను అనుభవాలన్ని ఏవీఎస్ కొంత మంది అప్పటి పాత్రికేయులతో చెప్పుకుని వాపోయేవారని..పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలని ఉన్నా…కళామాతలన్ని వదిలి వెళ్లలేక అన్ని బాధలు పడి నిలదొక్కుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ఏవీఎస్ బేసిక్ గా జర్నలిస్ట్ అట. సినిమా జర్నలిజంలో ఉంటూనే నటుడిగా టర్న్ తీసుకున్నారుట.
ఇలా చాలా మంది జూనియర్ కమెడియన్లు సీనియర్ చేతుల్లో ర్యాగింగ్ కు గురయ్యారని..ఆ కథలను రాస్తే పెద్ద పుస్తకమే అవుతుందని అభిప్రాయపడ్డారు. నేటికి ఆ పరిస్థితి పరిశ్రమలో కొనసాగుతుంది. అయితే మరీ అంత దారుణమైన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడంతా కేవలం ట్యాలెంట్ అనే ట్రెండ్ నడుస్తోంది. రోజుకి లక్షలు పారితోషికం చెల్లించడం కన్నా తక్కువ పారితోషికంలో ఓ కొత్త కమెడియన్..ది బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చే వాళ్లు దొరుకుతున్నారు. కాబట్టి సీనియర్లు అయిన అలీ, బ్రహ్మానందం లాంటి వాళ్లను నవతరం దర్శకులు పక్కనబెడుతోన్న సంగతి తెలిసిందే.