“లైగర్” కి ఓవర్సీస్ లో టార్గెట్..ఎంత వసూలు చెయ్యాలంటే.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మంచి అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన భారీ చిత్రం “లైగర్” కూడా ఒకటి.

మరి ఈ సినిమాని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించగా ఓ పక్క విజయ్ మరియు పూరి జగన్నాథ్ ల కెరీర్ లో భారీ బిజినెస్ జరిగిన సినిమాగా ఇదే కాగా ఈ ఓ పక్క ఏపీ తెలంగాణ థియేట్రీకల్ హక్కులు అలాగే ఆడియో డిజిటల్ రైట్స్ లో కూడా తమ కెరీర్ లోనే భారీ మొత్తంలో బిజినెస్ జరుపుకున్న సినిమాగా లైగర్ నిలిచింది.

ఇక ఈ ఇదిలా ఉండగా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో అయితే ఈ సినిమా భారీ డీల్ కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి అక్కడ సరిగమ సినిమాస్ మరియు ఫార్స్ సినిమాస్ వారు కలిపి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుండగా అక్కడ ఈ చిత్రం 8 కోట్లకు పైగా వసూలు చేస్తే తప్ప బ్రేకీవెన్ అవ్వదట.

ఇప్పుడు అయితే అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఓవర్సీస్ లో సినిమా జాతకం ఏమిటి అనేది సినిమా ప్రీమియర్స్ తో తెలిసిపోతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో హాలీవుడ్ ప్రముఖుడు మైక్ టైసన్ కూడా నటించగా ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ చిత్రాన్ని ఈ ఆగస్ట్ 25న రిలీజ్ చేస్తున్నారు.