ఇండస్ట్రీ టాక్ : “లైగర్” ఓటిటి రిలీజ్ డేట్ ఆల్ మోస్ట్ ఇదే.?

తెలుగు సినిమా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా “లైగర్”. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ డ్రామా పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది.

కానీ అనుకున్న రేంజ్ అంచనాలు అయితే అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచిపోయింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి అయితే ఇప్పుడు టాక్ తెలుస్తుంది. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 30 నుంచి అందుబాటులోకి వస్తుంది అని మొదట బజ్ బయటకి రాగా..

ఇప్పుడు ఈ డేట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై అయితే ఇంకా అధికారిక అప్డేట్ కూడా త్వరలో రానుంది. ఇక ఈ చిత్రానికి ఛార్మి మరియు కరణ్ జోహార్ లు నిర్మాణం వహించగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అలాగే ఆలీ మరియు రమ్య కృష్ణ తదితరులు కీలక పాత్రలో నటించారు.