అందాల రాక్షసి అనగానే అందరికి గుర్తొచ్చే పేరు లావణ్య త్రిపాఠి. గత కొంత కాలంగా అమ్మడు పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. చివరగా చేసిన అర్జున్ సురవరం సినిమా పరవాలేధనిపించే విధంగా మెప్పించింది. అయితే ఆ సినిమాతోనే రెండు ఆఫర్స్ అందుకున్న అమ్మడు ఎలాగైనా టాలీవుడ్ లో తన రేంజ్ ను పెంచుకోవాలని ప్లాన్ వేసింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతులో రెండు సినిమాలు ఉన్నాయి. సందీప్ కిషన్ తో A1 ఎక్స్ ప్రెస్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న అమ్మడు అలాగే కార్తీకేయతో చావు కబురు చల్లగా అనే సినిమా చేస్తోంది. రెండు సినిమాలకు కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే A1 ఎక్స్ ప్రెస్ లో మాత్రం అమ్మడు హాకీ ప్లేయర్ గానే కాకుండా గ్లామర్ రోల్ తో కూడా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ లో లావణ్య సందీప్ కిషన్ కు ఘాటైన ముద్దు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఈ రేంజ్ లో రెచ్చిపోని అందాల రాక్షసి మొదటిసారి రొమాన్స్ డోస్ పెంచినట్లు అర్ధమవుతోంది. ఇక ట్రైలర్ లో అయితే జస్ట్ పెదాలను టచ్ చేయబోతున్నట్లు మాత్రమే చూపించారు. ఇక సినిమాలో మాత్రం ఆ డోస్ ఎక్కువగానే ఉంటుందని టాక్ వస్తోంది. మరి లావణ్యకు ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.