లేటెస్ట్ : ఓటిటిలో “థాంక్ యూ”..ఎందులో అంటే.!

Naga Chaitanya Thank You Movie

ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి అంచనాలు మధ్య వచ్చిన చిత్రాల్లో భారీ డిజాస్టర్స్ గా నిలిచినటువంటి కొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య మరియు రాశీ ఖన్నా, అవికా గోర్ తదితరులు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమా స్టార్టింగ్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. పైగా మహేష్ అభిమానుల దృష్టిని కూడా ఈ సినిమా ఆకర్షించింది. కానీ అనూహ్యంగా సీన్ కట్ చేస్తే ఈ చిత్రం భారీ డిజాస్టర్ట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ వెంటనే ఉంటుంది అని కూడా అంతా ఊహించారు.

కానీ ఫైనల్ గా అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకోగా ఈ సినిమాని ఈ ఆగస్ట్ 11 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది.

మరి దీనిని ప్రైమ్ వీడియో వారు అధికారికంగా అనౌన్స్ చేయగా ఈ అప్డేట్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాని మిడ్ బడ్జెట్ సినిమాగా నిర్మాత దిల్ రాజు నిర్మించగా జరిగిన బిజినెస్ లో 10 శాతం వసూళ్లు కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది.