ఇండస్ట్రీ టాక్ : ఓటిటిలో “లైగర్” రిలీజ్ కాస్త ముందే..ఇంతకీ ఎప్పుడంటే.!

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ అయ్యిన చిత్రాల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ అనన్య పాండే లు హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్ర “లైగర్” కూడా ఒకటి.

అయితే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్ లోనే భారీ హైప్ తో ఈ సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. ఇక గత ఆగస్ట్ 25న రిలీజ్ అయ్యి కేవలం వారం రోజులు మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటగా ఈ సెప్టెంబర్ 30న ఓటిటి లో స్ట్రీమింగ్ కి వస్తుంది అని బజ్ బయటకి వచ్చింది.

కానీ ఇప్పుడు అయితే సినీ వర్గాల్లో లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం లైగర్ చిత్రం ముందే ఓటిటి లో వచేస్తుందట. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ వారు ఈ సెప్టెంబర్ 22 నే అంటే ఈ రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నారట.

అయితే మొదట తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కి రానుండగా నెక్స్ట్ హిందీలో అందుబాటులోకి వస్తుందట. ఇక ఈ సినిమాలో అయితే మైక్ టైసన్, గెటప్ శ్రీను, చుంకీ పాండే తదితరులు నటించగా చార్మీ మరియు కరణ్ జోహార్ లు నిర్మాణం వహించారు.