వెల్ కమ్ టు ‘మంచు `సుబ్బ`లక్ష్మి’

మంచు లక్ష్మి ప్రసన్న మధ్యతరగతి గృహిణి పాత్రలో త్వరలో కనిపించి అలరించనుంది. ఆమె తాజాగా నటిస్తున్న వెబ్ సిరీస్ `మిసెస్ సుబ్బలక్ష్మి` త్వరలో ప్రేక్షకులను అలరించనుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో అవసరాల శ్రీనివాస్, మహేష్ విట్టా, జబర్దస్త్ వేణు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.

దాదాపుగా షూటింగ్ పూర్తయ్యింది. చాలా కాలం క్రితమే వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తైంది. కానీ టైమ్ చూసి విడుదలకు సిద్ధమైంది. మార్చి 8న జీ5 యాప్‌లో, వెబ్‌లో `మిసెస్ సుబ్బలక్ష్మి`ని చూడొచ్చు. మార్చి 8న మహిళా దినోత్సవంగా ఈ వెబ్ సీరిస్ ని విడుదల చేస్తున్నారు.

ఇక మంచు లక్ష్మి నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సీరిస్ కాన్సెప్ట్ ఏమిటంటే…`ఈ గృహిణి ఇంట్లో గందరగోళం సృష్టిస్తుంది మహిళా` అనే క్యాప్ష‌న్‌తో జీ5 టీమ్ `మిసెస్ సుబ్బలక్ష్మి`ని ప్రమోట్ చేస్తుంది.

ప్రముఖ సినీ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి రాసిన ఈ వెబ్ సీరిస్ పూర్తిగా ఓ జంట చుట్టూ తిరుగుతుంది. భర్త ..వెడ్డింగ్ యానవర్శిరీ డేట్ మర్చిపోవటంతో …కోపగించిన భార్య ఓ రోజంతా తన ఐడిండెటితో తనలాగే బ్రతకాలనుకుంటుంది. ఆ క్రమంలో పరిణామాలను ఫన్నీగా వివరిస్తుంది. ఈ సీరిస్ లో మంచు లక్ష్మికు భర్తగా అవసరాల శ్రీనివాస్ కనిపిస్తారు.