వెబ్ సిరీస్‌లపై ఒకప్పుడు చిన్న చూపు వుండేది. కానీ, సినిమాల్లో చూపించలేని అద్భుతమైన కంటెంట్ వెబ్ సిరీస్‌ల ద్వారా బయటికొస్తుంది. దాంతో స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్‌ల వైపు బాగా మొగ్గు చూపుతున్నారు. హీరోయిన్లలో సమంత, కాజల్.. తదితరులు ఇప్పటికే వెబ్ సిరీస్‌లలో తమ సత్తా చూపించారు.
అలాగే, వెండితెరపై అవకాశం దక్కించుకోలేకపోతున్న ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, రైటర్లు వెబ్ కంటెంట్ ద్వారా తమ తమ టాలెంట్ బయట పెడుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ కారణంతోనే మెగాస్టార్ చిరంజీవి సైతం వెబ్ సిరీస్‌ల వైపు ఆకర్షితులయ్యారు. మంచి కంటెంట్ దొరికితే వెబ్ సిరీస్‌లలో నటించేందుకు తనకేం అభ్యంతరం లేదని చెప్పారు ఆ మధ్య.
కానీ, ఇప్పుడు ఓ ప్రెస్టీజియస్ బ్యానర్ తొలిసారిగా వెబ్ సిరీస్ నిర్మించేందుకు ముందుకు రాగా, దాన్ని చిరంజీవితో రూపొందించాలని ప్రయత్నించగా చిరంజీవి సున్నితంగా నో చెప్పేశారట. అందుకు కారణాల్లేకపోలేదు.
ఇటీవల వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన సంగతి తెలిసిందే. నోటికొచ్చినట్లు ఆడిపోసుకున్నారు ఈ వెబ్ సిరీస్‌లో నటించినందుకు వెంకటేష్‌ని. ఆ కారణంగానే చిరు వెబ్ సిరీస్ అంటే ఆలోచిస్తున్నారట. కష్టపడి ఇంతవరకూ తెచ్చుకున్న స్టార్‌డమ్‌ని ఒక్క వెబ్ సిరీస్ ద్వారా బూడిద పాలు చేసుకున్నాడు వెంకటేష్ అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయ్ ‘రానా నాయుడు’ ద్వారా.