ఒత్తిళ్లకు, మనస్తాపానికి గురై ఆత్మ హత్యలకు పాల్పడిన సెలబ్రిటీలు టాలీవుడ్, బాలీవుడ్ లో చాలే మందే ఉన్నారు. క్షణంలో తీసుకున్న అలాంటి నిర్ణయాలతో విలువైన జీవితాన్ని శాశ్వత నిద్రలోకి నెట్టిన సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా మనస్థాపం అనే మనో వేదనతో ఎంతో మంది తనువు చాలించారు. తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో అన్ని భాషల పరిశ్రమలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. 34 ఏళ్ల వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మనస్థాపంతో ఫ్యాన్ కి ఉరివేసుకుని తనువు చాలించాడు. నటుడిగా ఎదిగే క్రమంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కున్నా…మనస్థాపం అనే మనోవేదనని సుషాంత్ జయించలేకపోయాడు.
నటుడిగా బంగారు భవిష్యత్ ను చిదిమేసి అనంతలోకాలకు ఎగిసాడు. ఈ నేపథ్యంలో నటి ఖుష్బూ కూడా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనిపించిందని తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడి బాధపడినప్పుడు చనిపోవాలనే ఫీలింగ్ వెంటాడిందన్నారు. ఇలాంటి పరిస్థితులు, సమస్యలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయని, వాటిని అధిగమించాలని సందేశం ఇచ్చారు. ప్రతీ ఒక్కరు బాధ, ఒత్తిడి ఎదుర్కుంటారు. నాకు అలాంటి సమస్యలు లేవని చెబితే తప్పే అవుతుంది. నన్ను అలాంటి సమస్యలు వెంటాడే సరికి చనిపోవాలనుకున్నా. కానీ అదే సమయంలో పోరాడాలి అన్న కసి కూడా ఏర్పడింది.
నన్ను నాశనం చేయాలన్నా ఆలోచన నుంచి నాకు నేనుగా భయటపడ్డాను. నా ముగింపు కోసం ఎదురుచూస్తున్న వారిని ఓడించాలని ఆత్మహత్య అనే బాధ నుంచి బయటపడ్డానని తెలిపారు. చనిపోవాలనుకునే సమయంలో పరిస్థితిలన్నీ అనుకూలంగా మారిపోతాయి. ఎందుకు బ్రతకాలి. బ్రతికి సాధించేది ఏముంది. ఇలా మానసికంగా ఇబ్బంది పడే కన్నా శాశ్వత నిద్రలోకి జారుకోవడం ఎంతో మేలు అనిపిస్తుంది. కానీ ఆ ఫేజ్ ని దాటాలంటే విలువైన మానవ జీవితాన్ని ఎందుకు వదులుకోవాలని ఆలోచించగలగాలి. అలా ఎన్నో బాధల్ని వెనక్కి నెట్టాను కాబట్టే ఈరోజు ఇలా ఉన్నానని ఖుష్బూ తెలిపారు.