ఆ సీఎంలా మ‌న సీఎంలు ఇంటింటికి మ‌ద్యం పంచాలా!

తెలుగు రాష్ర్టాల్లో లాక్ డౌన్ ఎంత ప‌టిష్టంగా అమ‌లవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. కరోనా వైర‌స్ ని క‌ట్ట‌డి చేయాల‌ని తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు లాక్ డౌన్ పొడిగించాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు. అయితే మందుబాబులు మాత్రం ఈ తీరుపై చిందులేస్తున్నారు. వైన్ షాపులు..బార్ అండ్ రెస్టారెంట్ లు అన్ని మూసేయ‌డంతో లిక్క‌ర్ లేక మ‌తిలేని వాళ్ల‌లో భ్ర‌మిస్తున్నారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నాలు చేస్తున్నారు. మందిస్తారా? చావ‌నా? అంటూ పోలీసుల్ని బెదిరిస్తున్నారు. భార్య‌ల్ని భ‌ర్త‌లు కొట్ట‌డం..భ‌ర్త‌ల్ని భార్య‌లు త‌న్న‌డం వంటి స‌న్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతున్నాయి.ఇటీవ‌ల ఇదే ఉదంతాన్ని ఎత్తిచూపుతు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలి లో తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల‌కు ఓ విజ్ఞ‌ప్తి చేసాడు.

కేసీఆర్ కేటీఆర్, జ‌గ‌న్ ల‌కు మ‌మ‌తా బెన‌ర్జీలాంటి మంచి హృదయం ఉంటుంద‌ని ఆశిస్తున్నా. వీళ్లంద‌ర్నీ చీర్స్ చెప్ప‌మ‌ని అడుగుతున్నా. మ‌ద్యం లేక విసుగు చెంది, జుట్టు లాగడం, పిల్లలు లాగా ఏడ‌వటం.. మానసిక ఆసుపత్రులలో చేరడం మరియు భర్తలు కొట్టిన భార్యలు నిరాశతో తెలుగు రాష్ర్టాలు నిండిపోతున్నాయి. ముఖ్య‌మంత్రులిద్ద‌రు వాళ్ల బాధ‌ల‌ను అర్ధం చేసుకోవాలి. వాళ్ల దాహాన్ని తీర్చాలి. ప‌శ్చిమ బెంగాల్ సిఎం మ‌మ‌తా బెన‌ర్జీలా ఇంటింటికి మ‌న సిఎంలు మ‌ద్యం పంపిణీ చేయాలని కోరారు.

దీనికి కేటీఆర్ సెటైరిక‌ల్ గా స్పందించారు. మంత్రిగారు పంచ్ ల‌కే ఫ‌ల‌క్ నుమాలా లాంటి వారు. మంచిగా స‌మాధానం అంతే గౌర‌వంగా ద‌క్కుతుంది. తేడా వ‌స్తే కేసీఆర్ లాగే రియాక్ష‌న్ ఉంటుంది. వ‌ర్మ‌కి అలాగే గూబ గీయిమ‌నేలా బ‌ధులిచ్చారు.రాముగారు మీరు హెయిర్ క‌టింగ్ గురించి మాట్లాడుతున్నారా? అంటూ కౌంట‌ర్ వేసారు. ఇక చీర్స్ టాపిక్ గురించి కేటీఆర్ ఎలాంటి బ‌ధులివ్వ‌లేదు. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో కేటీఆర్ కు మంచి స్నేహ‌బంధం ఉన్న సంగ‌తి తెలిసిందే.