గొడవలు ఎన్నైనా డైరక్టర్ గా  మీ పేరే వేస్తామండీ…

వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా ప్రముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ఆ మధ్యన మొదలైన మ‌ల్టీ లాగ్వేజ్ మూవీ మ‌ణిక‌ర్ణిక‌.. ఈ  చిత్రంలో ఝాన్సీ ల‌క్ష్మీ భాయిగా కంగ‌నా రానౌత్ న‌టిస్తున్న‌ది.. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొనసాగుతోంది అనుకునేలోపల..క్రిష్ ఆ సినిమాని మధ్యలోనే వదిలేసి ఎన్టీఆర్ షూటింగ్ లో పడ్డారు అన్నారు. ఎన్టీఆర్ షూటింగ్ కోసమే ఆ సినిమాని వదిలేసానని క్రిష్ చెప్తున్నా…ఎవరూ నమ్మడం లేదు. కంగనా అతి చేష్టలు, అతి జోక్యంతోనే ఆయన ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చారని బాలీవుడ్ టాక్.ఇప్పుడు కంగనానే డైరక్ట్ చేస్తోంది.

రీషూట్స్ కూడా చేస్తోంది. నిర్మాత కూడా కంగనా పక్షమే కాబట్టి… ఆమె కు అది చెల్లుబాటు అవుతోంది. ఆ విషయం   ప్రక్కన పెడితే ఆ సినిమాకు డైరక్టర్ గా క్రిష్ పేరునే వేస్తుందిట. నిర్మాతలు ఆమెకే డైరక్టర్ గా క్రెడిట్ ఇస్తామన్నా..నో చెప్పేసి క్రిష్ పేరునే వెయ్యాలని క్లారిటీగా చెప్పిందట.  అయితే ఈ ప్రాజెక్టు విషయమై నోరు విప్పటానికి క్రిష్ ఇష్టపడటం లేదు.  ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

దాదాపు వంద కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి…రాజమౌళి తండ్రి ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు అందించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ..ఆ కథ కూడా ఆయన రాసినట్లు ఉండదట. ఆయన  రాసిన స్క్రిప్టులో కంగన తన టీమ్ తో కలిసి పులిహార కలిపేసిందంటున్నారు.