సౌత్ లో సంజయ్ దత్ నటిస్తోన్న రెండో చిత్రం కె.జి.యఫ్ చాప్టర్ 2 నాగార్జున, రమ్యకృష్ణ, కృష్ణవంశీ కాంబినేషన్‌లో రూపొందిన చంద్రలేఖ
సినిమాలో కొన్ని క్షణాల పాటు అతిథి పాత్రలో సంజయ్ దత్ కనపడిన సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ చాప్టర్ 1
లో అధీర పాత్ర పరిచయం ఉంటుంది. అలాగే సదరు పాత్ర రెండు సీన్స్‌లో మాత్రమే కనపడుతుంది. చాపర్ట్ 1 సాధించిన విజయంతో దర్శక నిర్మాతలు రెండో చాప్టర్‌కు కీలకంగా ఉండే ఈ పాత్రలో సంజయ్ దత్‌ను నటింప చేయాలనుకున్నారు. అందుకు ప్రత్యేక కారణం కె.జి.యఫ్ చాప్టర్ 2
సినిమా హిందీలో విడుదల కానుంది. హిందీలో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచడానికి సంజు దాదా ని సంప్రదించగానే వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. ఇది వరకే అధీర పాత్రలో సంజయ్‌దత్ నటిస్తున్నారని పలు వార్తలు వచ్చినా, నేడు సంజయ్ దత్ పుట్టినరోజు..ఈ సందర్భంగా అధీర పాత్రలో సంజయ్ నటిస్తున్నారే విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ ఆయన లుక్‌ను విడుదల చేశారు.