సంజయ్ దత్ : ‘నాకు క్యాన్సర్ – నాలుగు ఫ్లాట్లు నీ పేరున రాస్తున్నా 28 కోట్లు జాగ్రత్త ‘ భార్యతో స్టార్ హీరో మాటలు..!

సంజయ్ దత్: బాలీవుడ్ సీనియర్ హీరో క్యాన్సర్ తో పోరాడి బయటపడిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ కి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్ లో రూపొందుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 లో అధీరా అన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో యష్ తర్వాత మళ్ళీ అంత పవర్ ఫుల్ రోల్ అంటే సంజయ్ దత్ దే అని దర్శకుడు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే సంజయ్ దత్ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స కోసం విదేశాలకి వెళ్ళాడు. ఈ సమయంలో సంజయ్ దత్ పడిన బాధ వర్ణనాతితం అని చెప్పాలి.
అయితే సంజయ్ దత్ ..తనకి క్యాన్సర్ అని తెలిశాక తన, భార్య పిల్లల కోసం ఏకంగా 27 కోట్ల విలువ చేసే నాలుగు ఫ్లాట్లను రాసిచ్చాడు. సంజయ్ దత్ 2020 డిసెంబర్ లో బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న నాలుగు అపార్టుమెంటులను బహుమతిగా ఇచ్చారు. అతి తక్కువ వ్యవధిలో ఈ పనిని పూర్తి చేశాడు. సంజయ్ దత్ ఈ అపార్టుమెంట్స్ ని భార్య మాన్యతాదత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. సంజయ్ దత్ 2020 డిసెంబర్ 3 న ఈ నాలుగు ఫ్లాట్లను మాన్యతకు బహుమతిగా ఇచ్చే డాక్యుమెంటేషన్ పనులు మొదలు పెట్టాడట. ఆ తర్వాత 2020 డిసెంబర్ 23న బహుమతి పత్రాలను రిజిస్ట్రేషన్ చేశారు. 301.. 401.. 1101 .. 1201 అపార్టుమెంటులను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఫ్లాట్ల విలువ 26.46 కోట్ల విలువ చేస్తాయట. మాన్యత అసలు పేరు దిల్నాషిన్ దత్. ఆ పేరుతోనే ఇవన్నీ రిజిస్టర్ అయ్యాయని తెలుస్తోంది.

కాగా సంజయ్ దత్ కి మూడో దశ క్యాన్సర్ అన్న సంగతి 2020 ఆగస్టులో బయటపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముంబైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అక్టోబర్ లో సంజయ్ దత్ ఆరోగ్యంగా ఉన్నానని.. క్యాన్సర్ నుంచి కోలుకోవడటానికి సహకరించిన వైద్యులకు .. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తర్వాత సంజయ్ దత్ కి టాలీవుడ్ నుంచి భారీ ప్రాజెక్ట్స్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్ కి కీలక పాత్ర చేయమని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న సలార్ అని సమాచారం.