ఇంట్రస్టింగ్ : హిందీ ‘ప్రస్థానం’టీజర్ ఇదిగో

ఇంట్రస్టింగ్ : హిందీ ‘ప్రస్థానం’టీజర్

2010వ సంవత్సరంలో తెలుగు లో వెర్సటైల్ యాక్టర్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో, శర్వానంద్ మరియు సందీప్ కిషన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం‘ప్రస్థానం’. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ దేవాకట్ట పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శర్వానంద్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ప్రస్థానం. దేవా కట్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు.

Prassthanam - Official Teaser | Sanjay Dutt | Jackie Shroff | Deva Katta | 20th September 2019

‘మంచిని చేస్తే రామాయణం జరిగింది, అదే మంచిని దూరం చేస్తే మహాభారత యుద్ధం జరిగింది’ అనే డైలాగ్ తో ప్రారంభమయి, ఆద్యంతం ఆకట్టుకునే యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ విశేషంగా అలరిస్తోంది. వారసత్వ అధికారం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ లోను మంచి అంచనాలు నెలకొన్నాయి.

హిందీలో సాయి కుమార్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించగా, ఇతర ముఖ్య పాత్రల్లో ఆలీ ఫైజల్, మనీషా కొయిరాలా, జాకీ ష్రాఫ్, అమైరా దస్తూర్ నటించారు.సంజయ్ దత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాన్యత దత్ నిర్మించిన ఈ సినిమాను కూడా తెలుగులో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన దేవా కట్టానే దర్శకత్వం వహించడం విశేషం. 2019 సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.