రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. కన్నడంలో 100 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించిన ఈ చిత్రం హిందీలో అంతకు రెట్టింపు వసూలు చేసింది. తెలుగులోనూ హిట్టయ్యింది. ఇరుగు పొరుగు భాషల్లో క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుంది. దాదాపు 350 కోట్ల వసూళ్లతో సంచలనమే అయ్యింది. అందుకే ఈ ఫ్రాంఛైజీ నుంచి సినిమా వస్తోంది అంటే అందరిలోనూ ఒకటే ఆసక్తి.
ప్రస్తుతం కేజీఎఫ్ 2 .. ఈ సిరీస్ లో ప్రీక్వెల్ మాత్రమే. ఇది సీక్వెల్ కాదని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా తర్వాత కూడా వరుసగా ఇందులో సినిమాలు తీస్తామని హోంబలే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విజయ్ కిరంగదుర్ చెబుతున్నారు. అలాగే ప్రీక్వెల్ శాటిలైట్ రైట్స్ పై వస్తున్న పుకార్లను ఖండించారు.
కెజిఫ్ 2 సినిమా శాటిలైట్ రైట్స్ దాదాపు 120 కోట్లకి అమ్మి నట్లు గా వస్తున్న వార్తలను నిర్మాతలు ఖండించారు. తమకు వివిధ రైట్స్ విషయంలో భారీ బిజినెస్ సాగిందని… చాలా మంది తమను సంప్రదిస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఐతే ఇంత వరకు శాటిలైట్ ఎవరికి అమ్మలేదు అని టీం చెబుతోంది. ఇది సీక్వెల్ కాదు అని మొదటి భాగానికి ఇది ప్రిక్వెల్ అని వెల్లడించారు. అలానే ఈ సిరీస్ కూడా కంటిన్యూ అవుతుంది. అని ఇంతటి తో దీని ఆపే ఆలోచన లేదని నిర్మాత తెలిపారు.