ఓర్‌ మ్యాక్స్ పవర్‌ రేటింగ్స్ లో మరో రికార్డు కొల్లగొట్టిన కేజిఎఫ్2!

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమా ఊహించిన విధంగా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కించారు.ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది. ఇలా కే జి ఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించింది.

థియేటర్లో క్లోసింగ్ డే వరకు కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా అనంతరం డిజిటల్ మీడియాలో కూడా తన సత్తా చాటుకుంది. ఇలా డిజిటల్ స్క్రీన్ పై కూడా అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇదిలా ఉండగా తాజాగా ఇండియాలోనే ఏ సినిమా కూడా దక్కించుకొని అరుదైన రికార్డ్ ఈ సినిమా దక్కించుకోవడమే కాకుండా అలాంటి ఘనత సాధించిన మొదటి సినిమాగా కూడా రికార్డ్ సృష్టించింది.

కేజిఎఫ్ 2 సినిమా ఓర్‌ మ్యాక్స్ పవర్‌ రేటింగ్స్ లో ఈ సినిమా దిమ్మతిరిగే రేటింగ్‌ను కైవసం చేసుకుని నెంబర్ వన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 90+రికార్డు క్రియేట్ చేసింది. ఈ రేటింగ్‌కు రీచైన ఫస్ట్ ఫిల్మ్‌గా హిస్టరీకెక్కింది. అయితే ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో కలిపి ఈ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ విధంగా కే జి ఎఫ్ సినిమా ఇప్పటికీ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బెస్ట్ సినిమాగా పేరు సంపాదించుకుందని చెప్పాలి.