మాస్..”కేజీఎఫ్ 2″ 50 రోజుల వసూళ్లు, రికార్డు సెంటర్స్ వివరాలు ఇవే.!

KGF Chapter 3

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాన్స్టర్ హిట్ భారీ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన ఈ బిగ్గెస్ట్ మాస్ సినిమా భారీ రికార్డులతో సెన్సేషనల్ వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా కొల్లగొట్టింది.

అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చి ఆల్రెడీ 50 రోజులు పూర్తి అయ్యిపోయింది. అయినా ఇంకా పలు ప్రాంతాల్లో భారీ రెస్పాన్స్ తో రన్ ని కొనసాగిస్తుండగా ఈరోజుతో హిస్టారికల్ 50 రోజులు రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా 50 రోజులు ఎన్ని సెంటర్స్ లో పూర్తి చేసుకుంది.

ఎంత వసూళ్లు అందుకుందో తెలుస్తుంది. మరి ఈ సినిమా 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 400 కి పై చిలుకు సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుందట. వాటిలో 310 కి పైగా ఇండియాలో ఉండగా 10కి పైగా ఓవర్సీస్ లో అయ్యాయట. ఇక ఈ చిత్రం అయితే 50 రోజుల్లో టోటల్ గా రికార్డు మొత్తంలో 12 వందల 35 కోట్లకి పైగా భారీ గ్రాస్ ని అందుకుందట.

దీనితో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఒక అరుదైన ఘనత అందుకున్న సినిమాగా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. మరి ఇంకా ఈ సినిమాలో రవీనా టాండన్ అలాగే సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే రవి బాసృర్ సంగీతం అందించిన ఈ సినిమాని హోంబళే ఫిలిమ్స్ వారు తెరకెక్కించారు.