“లక్ష్మీస్ వీరగ్రంధం ” అందుకే తీస్తున్నా…జగదీశ్వర రెడ్డి

ఆ మధ్య ఎన్టీఆర్ బయోపిక్  ” లక్ష్మీస్ వీరగ్రంధం ” ను రూపొందిస్తున్నామని , ఈ సినిమా లక్ష్మి పార్వతి మహానటుడు రామారావు  జీవితంలో ప్రవేశించిన నాటినుంచి , రామారావు గారు చనిపోయేంత వరకు ఉంటుందని నిర్మాత , దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి చెప్పాడు . ఈ చిత్రం షూటింగ్ కూడా హైద్రాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ లో మొదలు పెట్టాడు . కొంత షూటింగ్ చేసిన తరువాత వార్తల్లో లేకుండా పోయింది .

ఈ సినిమా తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉంటుందని తానూ భావిస్తున్నానని లక్ష్మి పార్వతి తీవ్ర నిరసన తెలియ జేసింది . ఈ సినిమాను ఆపడానికి అనేక ప్రయత్నాలు చేసింది . అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది . ఇప్పుడు “ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహా నాయకుడు “, వర్మ ” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” చిత్రాలు షూటింగ్ చేసుకోవడం వాటికి వ్యాపారంగా క్రెజ్  రావడంతో జగదీశ్వర రెడ్డి  మళ్ళీ జగదీశ్వర రెడ్డి తన “లక్ష్మీస్ వీరగ్రంధం ” సినిమా షూటింగ్ మొదలు పెట్టె ఉద్దేశ్యంతో వున్నాడు . లక్ష్మి పార్వతి నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఆపాను అంటున్నాడు .

లక్ష్మి పార్వతి మాయలో పది మహా నటుడు రామారావు జీవితాన్ని ఎలా మరణ శయ్య మీదకు చేర్చుకున్నాడో , ఆయన్ని ఎలా  ప్రలోభానికి గురి  చేసిందో  ఈ సినిమాలో చూపిస్తున్నామని, బయటకు రాణి నిజాలను సినిమా ద్వారా ప్రజలకు తెలియజేయ బోతున్నాము అని చెప్పారు .