షాకింగ్ : పచ్చి బూతు వీడియో లో కత్తి మహేష్

తెలుగులో సిని విమర్శకుడుగా పేరు తెచ్చుకున్న కత్తి మహేష్ ఇప్పుడు అడల్ట్ కామెడీ జోన్ లో హఠాత్తుగా దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచారు. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’టైటిల్ తో విడుదల కాబోతున్న ఓ చిత్రం ప్రోమోలో అయన కనపడ్డారు. ‘ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు’ అనే టైటిల్ తో తమిళంలో ఒక సెక్స్-హారర్ మూవీ వచ్చింది . ఈ సంవత్సరం మే లో విడుదల అయిన ఈ సెక్స్-హారర్ మూవీ పెద్దగా తమిళ ప్రేక్షకుల చేత ఓకే అనిపించుకుంది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టైటిల్ తో తెలుగులో డబ్బింగ్ చేశారు. కొంత మంది తెలుగు నటులను పెట్టి రీమిక్స్ కూడా చేసారు.

https://www.youtube.com/watch?v=Ek2G8nWqfFI

ఈ మూవీ టీజర్ ఈమధ్యే విడుదల అయింది. ఈ మూవీ టీజర్ లో క్రిటిక్ కత్తి మహేష్ మూవీ స్టోరీని వివరిస్తూ కనిపించాడు. “ఇదో హారర్ మూవీ. స్టోరీ ఏంట్రా అంటే ఊరవతల ఒక బంగాళా(పట్టయా సిటీ లో). పన్లేని నలుగురు ఆ బంగాళాకి వెళ్తారు. అక్కడున్న దెయ్యం వీళ్ళను ఎలా టార్చర్ పెట్టిందనేది స్టోరీ ” అంటూ ఇంట్రో ఇచ్చాడు. ఇక టీజర్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ లో “ఈ మూవీ మామూలుగానే మూడు రోజులు ఆడుతుంది. మీరు ధర్నాలు.. డిబేట్లు పెట్టి సూపర్ హిట్ చేసేయకండి.” అంటూ ఎండ్ చేశాడు.

అడల్ట్ కంటెంట్ చిత్రాలకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది.తెలుగులోనూ ఆర్ ఎక్స్ 100 వచ్చాక బూతుని నమ్ముకుని వస్తున్న సినిమాలు పెరిగిపోయాయి. రొటీన్ ఫార్మాట్ చిత్రాలు ఎన్ని వస్తున్నాయో అదే స్దాయిలో బూతు కలిపిన కామెడీ సినిమాలు తెరకెక్కి కవ్విస్తున్నాయి. అడల్ట్ కంటెంట్ సినిమానా ..మనకు పెద్ద వింతేముంది అంటారా..ఇవి అడల్ట్ కంటెంట్ కు హారర్ మిక్స్ చేసిన బాపతు. ఈ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్ ను మీరు కూడా చూడండి.