కొరొనా వైర‌స్ డేంజ‌ర్.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

ఆంత్రాక్స్ ని మించిన ప్ర‌మాదం దేశంలో ప్ర‌వేశించిందా? అంటే అవున‌నే ప్ర‌చారం అవుతోంది. ఇప్ప‌టికే మన దేశంలో కేర‌ళ న‌ర్స్ కి కొరొనా వైరస్ సోకింది. కేరళలోనే మ‌రో ఏడుగురికి కొరొనా వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో… వారిపై పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే… హైదరాబాద్‌లో ఒకరికి, ముంబైలో ఇద్దరికి, బెంగళూరులో ఒకరికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చన్న అనుమానంతో టెస్టులు చేశారు. ఐతే… హైదరాబాద్, ముంబై, బెంగళూరులో వాళ్లెవరికీ కొరొనా వైరస్ సోకలేదని పరీక్షల్లో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖే స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు తెలిపింది. అందువల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు టెన్షన్ పడాల్సిన పనిలేదు. అయినప్పటికీ… ఇది వైరస్ కాబట్టి… గాలి ద్వారా ఒకరి నుంచీ మరొకరికి సోకుతుంది కాబట్టి… కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

వ్యాధి లక్షణాలు ప‌రిశీలిస్తే.. ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్‌ను కలవాలి. వైరస్ ఎలా వ్యాపిస్తుంది అన్న‌ది ప‌రిశీలిస్తే.. ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా… పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే… రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా… అక్కడ ఉండే వైరస్… బాడీపైకి వచ్చి… క్రమంగా అవి నోట్లోంచీ ఊపిరి తిత్తుల్లోకి వెళ్తాయి. అంతే వైరస్ వచ్చినట్లే. ఇవి ఎంత వేగంగా వస్తాయంటే… చేతులు శుభ్రం చేసుకునేలోపే వచ్చేస్తాయి.

ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అంటే.. ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు (వ్యాక్సిన్) లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. అలాగని వారిని అంటరాని వారిలా చూడకూడదు. అయినా ఆ ఛాన్స్ డాక్టర్లు మీకు ఇవ్వరు. ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్లు తెలిస్తే… డాక్టర్లు ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచేస్తారు. ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటివి వస్తే… వాళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ… ఎక్కువ నీళ్లు తాగాలి. ఒకట్రెండు రోజుల్లో అవి తగ్గకపోతే… ఎవర్నీ టచ్ చెయ్యకుండా వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.