వేషం కావాలా.. నీ కూతురుని బెడ్ రూం కు పంపు

మన సౌతిండయన్ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటని అడుగుతున్న వాళ్లకు ఈ సంఘటన చెంపపెట్టు… లేకపోతే నీ కూతురుని పడకగదికి పంపు అని తల్లిని అడిగే స్దాయికి దిగజారటమేంటి

తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న మ‌రోటి వెలుగులోకి వ‌చ్చింది. త‌మిళ ఇండ‌స్ట్రీలోనే ఓ హీరోయిన్ తో పడక పంచుకోవాలని ఆశపడి ఆమె త‌ల్లితో ద‌ర్శ‌కుడు జ‌రిపిన బేర‌సారాలు అసహ్యం పుట్టిస్తున్నాయి. అచ్చం అప్పుడెప్పుడో కృష్ణవంశీ చిత్రం ఖడ్గం లో చూపించినట్లు అనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. క‌నీ కుస్రుతి అనే మ‌ల‌యాళ హీరోయిన్ కు ఇదే సమస్య ఎదురైంది. కామ‌పిశాచి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు వ‌చ్చాయి. అవ‌కాశం రావాలంటే ప‌డ‌క గ‌దికి రావాల్సిందే అంటూ ద‌ర్శ‌క నిర్మాత‌లు కండీష‌న్ పెడ్తే నో చెప్పిందిట. తను ఒప్పుకోకపోవ‌డంతో ఏకంగా త‌న త‌ల్లితోనే బేర‌సారాలు న‌డిపించార‌ని చెబుతుంది ఈ హీరోయిన్.

ఆమె తల్లితో .. నీ కూతురును ఎలాగైనా ఒప్పించి.. బెడ్రూమ్ పంపించాలంటూ త‌న త‌ల్లిని బెదిరించారంటారంటోంది క‌నీ క‌స్రుతి. ఈమె మాట‌లు ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి. ఈ ఇబ్బందులు ప‌డ‌లేక ఏకంగా న‌ట‌న వ‌దిలేయాల‌ని నిర్ణయానికి వచ్చానంటోంది క‌నీ కుస్రుతి. అయితే ఫైనల్ ట్విస్ట్ ఏమిటి అంటే.. ఆ డైరక్టటర్ పేరు మాత్రం బ‌య‌టికి చెప్ప‌టానికి ఇష్టపడకపోవటం. చెప్తేనే కదా సభ్య సమాజానికి తెలిసేది.