ఆ సినిమాలో కరుణానిధిగా ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటన గురించి చెప్పేదేముంది. విలన్ గా తండ్రిగా, నటుడిగా ఎన్నో పాత్రలు ఆయన పేరు చెప్పగానే మన మదిలో మెదులుతాయి. పైగా దక్షిణాది మొత్తం సుపరిచితుడు అయిన నటుడు. దాంతో పెద్ద సినిమాలు చేసేటప్పుడు ఆయన్ని దృష్టిలో పెట్టుకుంటారు దర్శకనిర్మాతలు.

ప్రస్తుతం తమిళంలో దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవితకధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ జయలలిత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తుండగా, ఎం.జీ.ఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఈ సినిమాలో మాజీ సీఎం కరుణానిధి పాత్రను ప్రకాష్ రాజ్ పోషించనున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏ.ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్నారు.