సింహా- లెజెండ్ చిత్రాలతో బంపర్ హిట్లు కొట్టాడు బాలకృష్ణ. రెండు మాస్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గా బోయపాటి అంటే ఆయనకు అంత గురి. అందుకే ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీలో బాలయ్య మాస్ పవర్ ని ఓ రేంజులో చూపించేందుకు బోయపాటి వేస్తున్న ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. నటసింహాన్ని ఏకంగా అఘోరా పాత్రలో చూపిస్తున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఫలిస్తాయా? అన్నది అటుంచితే తాజాగా ప్లాన్ బీ బయటపడింది.
తాజా సమాచారం ప్రకారం.. బాలయ్యతో పాటు ఈ మూవీలో ఓ యంగ్ హీరో నటిస్తాడని ఇందులో సమరసింహారెడ్డి తరహా కాన్సెప్ట్ రక్తి కట్టిస్తుందని చెబుతున్నారు. ఎన్బీకే సలహా మేరకు ఓ ముగ్గురు హీరోల పేర్లను బోయపాటి పరిశీలించాడట. అందులో కళ్యాణ్ రామ్ సహా నాగశౌర్య- బెల్లంకొండ శ్రీను పేర్లు ఉన్నాయి.
కళ్యాణ్ రామ్ ఇప్పటికే బాబాయ్ తో కలిసి సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక బాలయ్య స్నేహితుడు బెల్లంకొండ సురేష్ వారసుడు శీనూ కూడా ఇటీవల వరుస సినిమాలతో వెలుగుతున్నాడు. వీళ్లతో పాటు నాగశౌర్యతో బోయపాటి క్లోజ్ గా ఉన్నాడు. కారణాలు ఏవైనా కానీ ఆ ముగ్గురిలో ఆఫర్ ఎవరిని వరిస్తుంది? అన్నదే ఆసక్తికరం.