కాజ‌ల్ స‌డెన్ ట్విస్ట్.. జీవితంలో ఊహించ‌ని మ‌లుపు

Kajal Agarwal

డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి స్టార్ హీరోయిన్‌

పెద్ద తెర‌కు ప్ర‌త్యామ్నాయంగా బుల్లితెర – ఓటీటీ వేదిక‌లు వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ ఉపాధి అంత‌కంత‌కు పెరుగుతున్న వేళ స్టార్ హీరోయిన్ల చూపు అటువైపు ప్ర‌స‌రించ‌డం ట్రెండింగ్ అవుతోంది. కెరీర్ తారుమారైతే వెబ్ సిరీస్ లు ఆదుకుంటున్నాయి. అదే త‌ర‌హాలో.. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో క్రేజీ నాయిక‌గా పేరుతెచ్చుకున్న కాజ‌ల్ కెరీర్ బ్యాడ్ టైమ్ లో వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తోందా అంటే అవున‌నే స‌మాచారం. చేతినిండా సినిమాల‌తో బిజీ బిజీగా డగ‌డిపేసిన కాజ‌ల్ చేతిలో ఇప్పుడు పెద్ద‌గా క్రేజీ ఆఫ‌ర్లు అంటూ ఏమీ లేవు. దాంతో ఈ ముంబై చిన్న‌ది కొత్త దారిని ఎంచుకుంటోంది. సినిమాల్లో న‌టిస్తూనేడిజిట‌ల్ ప్ర‌పంచంలోకి ఎంట‌ర‌వుతోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్స్ వ‌రుస‌గా వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ డిజిట‌ల్ దునియాలో బిజీ అయిపోతున్నారు. తాజాగా స‌మంత కూడా అటు వైపుకు అడుగులు వేస్తున్నవేళ క్రేజీ గ‌ర్ల్ చంద‌మామ కాజ‌ల్ కూడా డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి ప్ర‌వేశిస్తోంది.

స‌మంత దారిలో కాజ‌ల్ కూడా..!

విభిన్న‌మైన చిత్రాల‌తో విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడిగా పేరుతెచ్చుకున్న త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు త్వ‌ర‌లో త‌మిళంలో ఓ వెబ్ సిరీస్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నాడు. హాట్ స్టార్‌లో కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి కాజ‌ల్ అగ‌ర్వాల్ అరంగేట్రం చేయ‌బోతోంది. టైటిల్ ఇంకా ఖ‌రారు కానీ ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ రోజే చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. మారుతి `బ‌స్‌స్టాప్‌` ఫేమ్ ఆనంది కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇదిలా వుంటే కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీని ప్రారంభించ‌బోతోంది. ఈ కంపెనీ ద్వారా వెబ్ సిరీస్‌ల‌ని నిర్మించ‌డానికి కాజ‌ల్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.