సాయంత్రం ఆరు దాటితే వేరే ప్రంపంచంలోకి కాజల్
ఇది ఒత్తిడి ప్రపంచం. ఎవ్వరైనా ఫేస్ చేయక తప్పదు. కెరీర్‌పరంగా ఎదురయ్యే వత్తిడి నుంచి బయటపడటానికి మెడిటేషన్ ఎంచుకుంటా. సాయంత్రం ఆరుదాటిన తరువాత సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటానంటోంది కాజల్ అగర్వాల్. శర్వానంద్ కు జోడీగా నటించిన తాజా చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15న థియేటర్లకు వస్తుంది.
రణరంగం ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా. డ్రామా అంటే ఎక్కువ ఇష్టపడే కాజల్ .. మంచి పాత్ర కూడా ఉండటంతో చేశానని చెబుతోంది. కథను ముందుకు తీసుకెళ్లేది తన పాత్రేనట! ‘రణరంగంలో చేసింది చిన్న పాత్రే. సినిమా అంతా కనిపిస్తానని అనుకోవద్దు. పాత్ర చిన్నదైనా.. కథను ముందుకు తీసుకెళ్లేది అదే. ఈ సినిమాలో వైద్యురాలిగా సెకెండాఫ్‌లో కనిపిస్తా. కాకపోతే, మంచి కథ, గ్రిప్పింగ్ కథనం. ఇవి నచ్చి పాత్ర నిడివి చూడకుండా ఓకే చెప్పాను. అంతే గానీ, ఇకపై అలాంటి పాత్రల వైపే మొగ్గు చూపిస్తాననడం సరైంది కాదు’ అంటోంది అందాల తార కాజల్ అగర్వాల్.
ఒకే రోజు రెండు భాషల్లో కాజల్ సినిమాలు విడుదలవ్వడం ఇదే ఫస్ట్‌టైం కాదు. ఇంతకుముందూ ఇలా రెండుసార్లు జరిగింది. ఇప్పుడు తెలుగులో రణరంగం, తమిళంలో కోమాలి వస్తుండటం చాలా హ్యాపీగా ఉందిట! రెండూ మంచి పేరు తేవాలని ఆశపడుతున్నానని చెప్పింది. నిర్మాత కావాలన్న ఆలోచన కూడా ఉందిట . కానీ, ఇప్పుడైతే కాదు. ఇప్పుడు నా సినిమాలతో చాలా బిజీగా ఉందట. తన వర్క్ మీదే ఫోకస్ ఫోకస్ చేస్తుందట. కాస్త తీరిక దొరికిన తరువాత మాత్రం ప్రొడక్షన్ ఫీల్డ్‌కి వచ్చే ఆలోచనైతే ఉందట!?