వెబ్ సిరీస్ లో కి నటి కాజల్‌ అగర్వాల్ ఎంట్రీ?

ప్రేక్షకుడికి వినోదం పంచడానికి సినిమా స్టార్స్‌ కొత్తకొత్త ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెబ్‌ వరల్డ్‌లోకి ప్రవేశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ కూడా ఈ వెబ్‌ సిరీస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.. తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు హాట్‌స్టార్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లోనే కాజల్‌ నటించనున్నారట.

పది ఎపిసోడ్స్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ షూటింగ్‌ను ఆగస్ట్‌లో ఆరంభించి సెప్టెంబర్‌కు ముగిస్తారట.

కాజల్‌ నటించిన ‘రణరంగం, కోమలి’ సినిమాలు ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కానున్నాయి.ఇంకా సినిమాల కంటే వెబ్ సిరీస్ బెటర్ అని కాలం చెల్లిన ఆర్టిస్టులు అనుకుంటున్నారు. గతంలో అయితే టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసేవారు. ఈ మధ్యకాలంలో మోహన్ బాబు ప్రొడక్షన్ లో ప్రారంభించిన వెబ్ సిరీస్ హీరో శ్రీకాంత్ గారు నటిస్తున్న విషయం తెలిసిందే.