స‌హ‌జ‌న‌టి కొడుకు అలా బుక్క‌య్యాడు

సీనియర్ న‌టి జ‌య‌సుధకు ఇద్ద‌రు పుత్ర‌ర‌త్నాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. జ‌య‌సుధ‌, నితిన్ క‌పూర్ జంట‌కు జ‌న్మించిన నిహ‌ర్ క‌పూర్, శ్రేయాన్ ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? అంటే అందులో చిన్నోడు హీరోగా ల‌క్ చెక్ చేసుకుని ఫెయిల‌య్యాడు. స్పోర్ట్స్ లోనూ అత‌డికి ప్ర‌వేశం ఉంది. ఇక‌పోతే పెద్దోడు నిహ‌ర్ క‌పూర్ గ‌త కొంత‌కాలంగా వ్యాపార రంగంలో రాణిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే హిందీ అమ్మాయి .. దిల్లీ బేస్డ్ ఉద్యోగి అయిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత్ కౌర్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 26న‌ బాజాకి ముహూర్తం నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. స‌హ‌జ‌న‌టి కం క‌పూర్ వార‌సుడి వివాహం టాపిక్ నెమ్మ‌దిగా ప‌రిశ్ర‌మ‌లో వైర‌ల్ అవుతోంది.

స‌హ‌జ‌న‌టిగా మూడున్న‌ర ద‌శాబ్ధాల సేవ‌లందించిన‌ జ‌య‌సుధకు రాజ‌కీయ రంగంలోనూ ప్ర‌వేశం ఉంది. జ‌య‌సుధ‌, త‌న కుమారుడు నిహ‌ర్ క‌పూర్ ఇద్ద‌రూ జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ ముందు వైకాపాలో చేరిన సంగ‌తి తెలిసిందే.కాబ‌ట్టి సినీరాజ‌కీయ రంగం నుంచి భారీగా ఈ పెళ్లికి అతిధులు విచ్చేసే ఛాన్సుంది. ఇక ఎలానూ క‌ళాబంధు టీఎస్సార్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లోనే భారీ పార్టీలు ఉంటాయ‌న్న స‌మాచారం ఉంది. 80ల‌లో జ‌య‌సుధ‌తో పాటు టాప్ స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన స్నేహిత బృందం మొత్తం ఈ పెళ్లికి విచ్చేసే అవ‌కాశం ఉంది. అటు హిందీ ప‌రిశ్ర‌మ నుంచి భారీగానే అతిధులు విచ్చేస్తారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌళి రింగ్ రోడ్ ప‌రిస‌రాల్లోనే జ‌య‌సుధ కుటుంబం నివాసం ఉంటుంద‌న్న సంగతి విదిత‌మే.