జయసుధ తెలుసు కదా మీకు.. తెలుగులో సీనియర్ హీరోయిన్. పాత తరం నటులందరితో ఆమె కలిసి నటించింది. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ లతోనూ ఆడిపాడింది. చాలామంది సీనియర్ హీరోల సరసన నాయికగా నటించిన జయసుధ.. నేటి తరంలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.
అయితే.. ఇటీవల జయసుధ.. పలు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు తన గతాన్ని బయటపెట్టింది. అప్పుడే తాను గతంలో ఓ స్టార్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు తెలిపింది.
జయసుధ యుక్తవయసులో ఉన్నప్పుడు పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ను తెగ ఇష్టపడేదట. తనను పెళ్లి చేసుకోవాలనుకుందట. అయితే.. ఆ వయసులో ప్రతి అమ్మాయికి ఆ కోరికలు సహజమేనని చెప్పిన జయసుధ… హాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ ను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు వెల్లడించింది. అలా.. తన గతాన్ని ఓసారి తవ్వి తీసింది జయసుధ.
ఇక.. జయసుధ ఫ్యామిలీ విషయానికి వస్తే.. జయసుధ భర్త నితిన్ కపూర్.. మూడు సంవత్సరాల కింద ఆత్మహత్య చేసుకున్నారు. జయసుధ కు ఇద్దరు కుమారులు. తను ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. 2009లో జయసుధ కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వైఎస్సార్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు.