ఫ‌స్ట్ లుక్‌: జ‌య‌ల‌లిత‌ ప్ర‌తిరూపం ఎవ‌రో క‌నిపెడ‌తారా?

అమ్మ జ‌య‌ల‌లిత‌పై ఒకేసారి రెండు బ‌యోపిక్ లు సెట్స్ కెళుతున్న సంగ‌తి తెలిసిందే. నిత్యామీన‌న్ క‌థానాయిక‌గా ఓ బ‌యోపిక్, కంగ‌న క‌థానాయిక‌గా మ‌రో బ‌యోపిక్ సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి. ఇప్ప‌టికే ఆ ఇద్ద‌రిపైనా ఫోటోషూట్లు చేశారు. నిత్యా బ‌యోపిక్ కి ది ఐర‌న్ లేడీ అంటూ పోస్ట‌ర్ ని రిలీజ్ చేస్తే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. క్వీన్ కంగ‌న బ‌యోపిక్ గురించిన అప్ డేట్స్ మ‌రిన్ని తెలియాల్సి ఉంది.

ఈలోగానే జ‌య‌ల‌లిత జీవితక‌థ‌తో తెర‌కెక్కుతున్న వెబ్ సిరీస్ క్వీన్ లుక్ రిలీజైంది. ఇందులో ర‌మ్య‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. గౌతమ్ మీన‌న్- ప్ర‌శాంత్ మురుగేష‌న్ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి ఎంఎక్స్ ప్లేయ‌ర్ ఓటీటీ వేదిక‌పై ప్ర‌సారం కానుంది. తెలుగు, త‌మిళం, హిందీ, బెంగాళీ భాష‌ల్లో ఈ వెబ్ సిరీస్ టెలీకాస్ట్ అవుతుంది. తాజాగా ర‌మ్య‌కృష్ణ పై ఫోటోషూట్ ని ఫ‌స్ట్ లుక్ ని రివీల్ చేశారు. అమ్మ జ‌య‌ల‌లిత ప్ర‌జాద‌ర్భార్ ని త‌ల వెన‌క వైపుగా ఫోటో రూపంలో రివీల్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇటీవ‌లే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్3కి రెండు ఎపిసోడ్ల‌కు ర‌మ్య‌కృష్ణ హోస్టింగ్ చేశారు. నాగార్జున స్థానంలో ర‌మ్య అభిమానుల్ని మెప్పించ‌గలిగార‌ని ప్ర‌శంస‌లొచ్చాయి. ఇక త‌మిళంలో ఇప్ప‌టికే సీరియ‌ళ్ల ద్వారా ర‌మ్య‌కృష్ణ పాపుల‌ర్. అందువ‌ల్ల వెబ్ సిరీస్ లోనూ రాణిస్తార‌నే భావిస్తున్నారు. శివ‌గామిగా ర‌మ్య‌కృష్ణ‌కు ఉన్న ఇమేజ్ జ‌య‌ల‌లిత వెబ్ సిరీస్ కి సాయం అవుతుంద‌నే భావిస్తున్నారు.