ప్రస్తుతం రమ్యకృష్ణ జోరు మామూలుగా లేదు. బుల్లితెర వెండితెర అనే తేడా లేకుండా అన్ని చోట్లా బిజీగా ఉంది. బుల్లితెరపై నాగ భైరవి అనే ధారవాహికతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగులో ప్రారంభమైన ఈ సీరియల్‌ను అత్యంత భారీ ఎత్తున ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సీరియల్ బాగానే నడుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రమ్యకృష్ణ వెండితెరపై పలు ప్రాజెక్ట్‌లతో మెరిసేందుకు రెడీగా ఉంది. అయితే ఇన్ని రోజులు లాక్డౌన్, కరోనా వల్ల షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టలేదు.
కానీ ఇప్పుడు మాత్రం సెలెబ్రిటీలందరూ కూడా సెట్స్‌లోనే ఉంటున్నారు. రమ్యకృష్ణ చేతిలో ఇప్పుడు కృష్ణశంశీ రంగమార్తాండ, పూరి జగన్నాథ్ లైగర్ చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా రమ్యకృష్ణ రేంజ్‌ను పెంచేలానే ఉంటాయి. శివగామి పాత్రను పోషించిన తరువాత రమ్యకృష్ణకు మళ్లీ అంతటి స్థాయిని తీసుకొచ్చే పాత్రలేవి రాలేదు. కానీ కృష్ణవంశీ, పూరి సినిమాల్లో మాత్రం రమ్యకృష్ణ క్యారెక్టర్‌కు చాలా ప్రాముఖ్యత ఉందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం లైగర్ సినిమా సెట్స్‌పైకి ఎక్కేందుకు రెడీగా ఉంది. మరో వైపు రంగమార్తాండ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాటికే మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయితే రమ్యకృష్ణ ఇప్పుడు లైగర్ సెట్‌లో అడుగుపెట్టేందుకు రమ్యకృష్ణ ప్రయాణం మొదలుపెట్టినట్టుంది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో ఫేస్ షీల్డ్‌ను పెట్టుకుని విమానం ఎక్కేసింది. ట్రావెల్ వైబ్.. ఎయిర్ పోర్ట్ డైరీస్ అని చెబుతూ ఫోటోను షేర్ చేసింది.