వాళ్ళ వీళ్ళ వారసులు హీరోలు అవడం కాదు , ఈ వారసుడు హీరో అయితే రికార్డ్స్ అన్నీ ఔట్ ?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ – శివగామి రమ్యకృష్ణ జంట పెద్దగా ఎక్కడా కనిపించరన్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ గొప్ప దర్శకుడైనా కూడా ఎందుకనో రమ్యకృష్ణ తన దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇష్టపడదు. చెప్పాలంటే కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ నటించి దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. ఎట్టకేలకి ఇప్పుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోంది. చాలా ఏళ్ళకి భార్య భర్త కలిసి ఒక సినిమాకి పని చేస్తుండటం తో అందరిలోనూ ఆసక్తి మొదలైంది.

బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ రేంజ్ మారిపోయింది. విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇలాంటి నేపథ్యంలో రంగ మార్తాండ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉండబోతోంది… ఎలాంటి పాత్ర ని డిజైన్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. కాగా ఇప్పుడు రమ్యకృష్ణ – కృష్ణవంశీల వారసుడు రిత్విక్ వంశీ తో కలిసి తాజాగా ఒక ఫొటో ని షేర్ చేశారు. ఈ లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రమ్యకృష్ణ – కృష్ణవంశీల నట వారసుడు రాబోతున్నాడంటు ప్రచారం మొదలైంది.

ఇంతకాలం రిత్విక్ వంశీ ఎలా ఉంటాడో .. ఎంత వయసో కూడా ఎవరికీ తెలియదు. ఈ విషయంలో ఆలోచించే అవకాశం కూడా రాలేదు. కాని తమ వారసుడి పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ రమ్య- కృష్ణవంశీ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ‘గాడ్ బ్లెస్ యు నాన్న బంగారం. రిత్విక్ వంశీ చాలా పెద్దవాడు అయిపోతున్నాడు. తన టీనేజ్ వయస్సులోకి వచ్చేశాడు. అతను అందంగా పెరుగుతున్నాడు కదా?.. అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ ఫోటో తో అందరు రిత్విక్ వంశీ.. తండ్రి కృష్ణవంశీ ల డైరెక్టర్ అవుతాడా ..లేక తల్లి రమ్యకృష్ణ లా హీరో అవుతాడా అని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి రిత్విక్ వంశీ కెరీర్ ఎటు వెళుతుందో.