Home Entertainment ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో.. రమ్యకృష్ణ మామూల్ది కాదు

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో.. రమ్యకృష్ణ మామూల్ది కాదు

రమ్యకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై, వెండితెరపై ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెరపై ధారవాహికతో రమ్యకృష్ణ అందరినీ పలకరించింది. నాగ భైరవి అంటూ లాక్డౌన్‌ తరువాత బుల్లితెరపై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక వెండితెరపైనా రమ్యకృష్ణ ఇప్పుడు ఫుల్ బిజీ అవుతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతోన్న రంగమార్తాండ, పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తోన్న సంగతి తెలిసింది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు సెట్స్‌పైకి రానున్నాయి.

Ramya Krishnan Safety At Workplace
Ramya krishnan Safety At Workplace

లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ వచ్చిన సెలెబ్రిటీలందరూ కూడా ఇప్పుడు సినిమా సెట్‌లో సందడి చేస్తున్నాడు. అన్ లాక్ ప్రక్రియ మొదలైన కొత్తలో అయితే అందరూ పీపీఈ కిట్, ఫేస్ షీల్డ్ ధరించి ఏలియన్స్‌లా ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు అది కాస్త తగ్గింది. కేవలం ఫేస్ షీల్డ్, మాస్కులు ధరించి షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. అదే విధంగా రమ్యకృష్ణ కూడా తన షూటింగ్‌లకు రెడీ అయింది. ఆ విషయం గురించి చెబుతూ కొన్ని పోస్ట్‌లు చేసింది.

నాకు ఎంతో నమ్మకమైన నా మేకప్ మెన్, నన్ను రక్షించే ఫేస్ మాస్క్.. పైగా అది నా హెయిర్ స్టైలిష్ట్‌కు ఎలాంటి అడ్డంకిని కలిగించదు.. అంతే కాకుండా అందులో నా ఫేస్ కూడా మీకు కనిపిస్తుందంటూ రమ్యకృష్ణ పోస్ట్ చేసింది. మొత్తానికి ఏ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతుందో చెప్పలేదు..కానీ వర్క్ మోడ్‌లో ఉన్నానని చెప్పేసింది. పైగా సేఫ్టీ ఫస్ట్.. సెల్ఫీయే సెకండ్ అని పరోక్షంగా కొందరికీ కౌంటర్లు వేసింది. ఇక రమ్యకృష్ణ కారులో మద్యం లభించడం, కారు డ్రైవర్ పోలీసులకు చిక్కడం వంటి వార్తలతో లాక్డౌన్‌లో రమ్యకృష్ణ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Posts

బ‌న్నీ సినిమాకు ఈ కుర్ర భామ నో చెప్ప‌డానికి కార‌ణం ఏంటి?

స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌క్క రాష్ట్రాల‌లోను విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు హిందీలోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. బ‌న్నీ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని...

మెగా హీరోకు అక్కినేని ఫ్యామిలీ స‌పోర్ట్‌.. ఇక ర‌చ్చ రంబోలానే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఎంతో ప్ర‌త్యేక‌మో మ‌నంద‌రికి తెలిసిందే. రెండు ఫ్యామిలీల నుండి చాలా మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, వారు వినూత్న క‌థా చిత్రాల‌తో...

పెళ్ళికి ముందు మొద‌లు పెట్టిన నిహారిక సినిమా మార్చిలో రాబోతుంది..!

మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు నిహారిక ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కొన్ని వెబ్ సిరీస్‌ల త‌ర్వాత ఒక మ‌న‌సు అనే చిత్రంతో వెండితెర డెబ్యూ ఇచ్చింది....

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

Latest News