ఆ నటి అందరి ముందే అలా చేసింది.. రమ్యకృష్ణ దెబ్బకు షాక్!!

ఒక్కోసారి అభిమానం కట్టలు తెచ్చుకుంటుంది. మన అభిమాన హీరోలు గానీ హీరోయిన్లు గానీ ఎదురుగా కనబడితే ఏం చేస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎవ్వరికైనా జరుగుతుంది. పెద్ద హీరోలను, హీరోయిన్లను చూసి మామూలు ప్రేక్షకులకే కాదు సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్ట్‌లకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే అందరూ ముందు అలా అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తే ఒక్కోసారి అవతల ఉన్న వారు షాక్ అవుతుంటారు.

తాజాగా ఇలాంటి ఓ ఘటనే రమ్యకృష్ణకు ఎదురైంది. మామూలుగా రమ్యకృష్ణ జీతెలుగులో నాగ భైరవి అనే సీరియల్‌లో నటిస్తోంది. అంటే రమ్యకృష్ణ కూడా జీ తెలుగు కుటుంబంలో ఓ మెంబర్ అయినట్టే. అయితే ఈ ఆదివారం జీ తెలుగు కుటుంబం అవార్ట్స్ 2020 ఈవెంట్ జరగబోతోంది. ఇందులో చాలా మంది స్టార్స్ స్పెషల్ ఎంట్రీఇవ్వబోతోన్నారు. నిధి అగర్వాల్, నమిత, శ్రుతీ హాసన్ వంటి తారలు సందడి చేయబోతోన్నారు.

Zee Telugu Kutumbam Awards 2020 Ramyakrishnan Faced Shocking Incident
Zee Telugu Kutumbam Awards 2020 RamyaKrishnan faced Shocking Incident

అయితే రమ్యకృష్ణను చూసి ఓ సీరియల్ నటికి అభిమానం హద్దులు దాటింది. ఆమెను చూసి ఆపుకోలేకపోయింది. సినిమాలు, సీరియల్స్‌లో నటించే ఈమె రమ్యకృష్ణను చూసి, ఆమెను స్ఫూర్తిగా తీసుకునే ఇండస్ట్రీకి వచ్చిందట. ఆమె మరెవరో కాదు. కార్తీదీపం సీరియల్‌లో అర్ధపావు భాగ్యంగా పాపులర్ అయిన నటి. ఆమె రమ్యకృష్ణను చూసి స్టేజ్ మీదే ఏకంగా సాగిలబడిపోయింది. ఈ చర్యకు రమ్యకృష్ణ ఒక్కసారిగా షాక్ అయింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles