జయప్రకాష్ రెడ్డి మృతికి అసలు కారణమిదే!

Jaya prakash Reddy Goes Into Stress Due To Family Members Tests Corona Positive

టాలీవుడ్ విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం (సెప్టెంబర్ 8) ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో బాత్రూంలోనే కుప్పకూలిపోయి మరణించాడు. అయితే ఇంత వరకు నిజమే అయినా అసలు కారణం వేరే ఉందట. ఇటీవలె ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడిందట. కానీ జేపీకి మాత్రం కరోనా నెగిటివ్ అని తేలిందట.

Jaya prakash Reddy Goes Into Stress Due To Family Members Tests Corona Positive
Jaya prakash Reddy Goes Into Stress Due To Family Members Tests Corona Positive

జయప్రకాశ్ కొడుకు కోడలికి కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. అంతేకాదు జయప్రకాశ్ గారికి గుండెకు సంబంధించిన సమస్య ఏమి లేదని ఆయన భార్య తెలిపారు. కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో వారిద్దరూ పెంట్ హౌస్ లో ఉంటున్నారట. కుటుంబంలో అందరికి కరోనా సోకడంతో జయప్రకాశ్ గారు మానసికంగా కృంగిపోయారని, ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో హార్ట్ ఎటాక్ వచ్చిందని అంటున్నారు.

Jaya prakash Reddy Goes Into Stress Due To Family Members Tests Corona Positive
Jaya prakash Reddy Goes Into Stress Due To Family Members Tests Corona Positive

ఏది ఏమైనా జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల యావత్ తెలుగు సినీ ప్రపంచమే కాదు.. ఏకంగా ప్రధాని మోదీ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. జయప్రకాష్ పోషించిన ఎన్నో విలక్షణమైన పాత్రలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సినీ ప్రముఖులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించారు. ఆయన కెరీర్‌లో ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి, నరసింహానాయుడు వంటి ఫ్యాక్షన్ సినిమాల్లో విలనిజం, కితకితలు, ఢీ, రెడీ వంటి చిత్రాల్లో అద్బుతమైన కామెడీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.